మీరూ ఫలించండి!

భూమిపై పుట్టిన ప్రతి మనిషికీ రెండు ముఖ్యమైన రోజులుంటాయంటారు క్రీస్తు. మొదటిది పుట్టిన రోజు. రెండోది పుట్టింది ఎందుకో...

Published : 15 Aug 2019 00:13 IST

క్రీస్తువాణి

భూమిపై పుట్టిన ప్రతి మనిషికీ రెండు ముఖ్యమైన రోజులుంటాయంటారు క్రీస్తు. మొదటిది పుట్టిన రోజు. రెండోది పుట్టింది ఎందుకో తెలుసుకోగలిగిన రోజు. కానీ ఈ రెండో రోజు కొందరి జీవితంలోనే వస్తుంది. వారిలో నువ్వు కూడా ఉండాలంటారాయన. జీవితం నిస్సారంగా, నిరర్థకంగా గడపడం పాపం. అది శిక్షకు అర్హమైన దోషం అని క్రీస్తు చెప్పారు. దానికి ఆయన ఓ ఉపమానం చెప్పారు. ‘ఫలించని ప్రతి ద్రాక్ష తీగను తోటమాలి తీసివేస్తాడు. ప్రతి తీగా మరింత ఎక్కువగా ఫలితాలనిచ్చేలా అడ్డుపడేవాటినీ పూర్తిగా తొలగిస్తాడు’... ఇదే ఆ ఉపమానం. 
ద్రాక్ష తోట ఫలించి, వృద్ధి చెందేలా చేయడమే తోటమాలి విధి. అలాగే సద్భావనలు, వృద్ధి ఉన్నవారిని దేవుడు కాపాడతాడు. ఉత్తమ వ్యక్తులుగా తీర్చిదిద్దడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. బద్ధకస్తులు, నిస్సారంగా జీవితం గడిపేవారు, దురాలోచనలు ఉన్నవారిని ఫలించని తీగలను తోటమాలి నరికినట్లుగా తొలగించివేస్తాడు. ప్రేమ, కరుణ, స్నేహం, వృద్ధి మీ లక్షణాలుగా ఎదగండని క్రీస్తు ఉద్బోధించారు.

- ఎం.సుగుణరావు

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని