విందు చేద్దామా?

సాంఘిక జీవనంలో పెళ్లిళ్లకు, ఇతర వేడుకలకు తరచూ వెళ్తుంటాం. అయితే ఆ వేడుకకు పిలిచిన వ్యక్తి.. అతిథులను పట్టించుకోకపోతే మనసు చివుక్కుమంటుంది. ప్రముఖులను మాత్రమే గౌరవిస్తూ.. మనల్ని నిర్లక్ష్యం చేస్తుంటే.. ఇక్కడికి ఎందుకు వచ్చామా అనిపిస్తుంది. ఈ సందర్భంలో క్రీస్తు చెప్పిన చక్కటి ఉపదేశాలు గుర్తు చేసుకోవాలి.. 

Published : 22 Aug 2019 00:03 IST

క్రీస్తువాణి

సాంఘిక జీవనంలో పెళ్లిళ్లకు, ఇతర వేడుకలకు తరచూ వెళ్తుంటాం. అయితే ఆ వేడుకకు పిలిచిన వ్యక్తి.. అతిథులను పట్టించుకోకపోతే మనసు చివుక్కుమంటుంది. ప్రముఖులను మాత్రమే గౌరవిస్తూ.. మనల్ని నిర్లక్ష్యం చేస్తుంటే.. ఇక్కడికి ఎందుకు వచ్చామా అనిపిస్తుంది. ఈ సందర్భంలో క్రీస్తు చెప్పిన చక్కటి ఉపదేశాలు గుర్తు చేసుకోవాలి.. 
‘‘నిన్నెవరైనా పెళ్లి విందుకు పిలిస్తే అగ్రపథాన కూర్చోవొద్దు. ఒకవేళ నీ కంటే గొప్పవారు వస్తే.. అతడిని నీ స్థానంలో కూర్చోబెట్టి.. నిన్ను వేరే చోటుకు మార్చవచ్చు. అప్పుడు నీవు సిగ్గుపడాల్సి వస్తుంది. అలాకాక నీవు కడపటి స్థానంలో కూర్చుంటే.. అగ్రపథం లభించే అవకాశం ఉంది. తన్ను తాను తగ్గించుకొను వాడు హెచ్చించబడతాడు.. తన్ను తాను గొప్పగా భావించే వాడు తగ్గించబడతాడు’’ ఈ క్రీస్తువాణి నేటికీ అనుసరణీయమే. 
విందుకు ఎవరిని పిలవాలి అనే విషయంలోనూ ప్రభువు చేసిన సూచన సదా అనుసరణీయం.. 
‘‘నీ ఇంట్లో జరిగే వేడుకలకు.. నీ స్నేహితులను, సహోదరులను, బంధువులను, ధనవంతులను, పొరుగువారిని పిలిస్తే వారు నిన్ను పిలుస్తారు. అలాకాక బలహీనులను, దివ్యాంగులను, బీదలను పిలువు.. వారు నిన్ను మళ్లీ వారింటికి పిలవలేరు కనుక.. నీవు ధన్యుడవు’’ అన్నారు ప్రభువు. ఒకాయన తన ఇంట్లో విందు ఏర్పాటు చేసి.. బంధువులను, స్నేహితులను పిలిచాడు. అయితే వారు వేరే పనులు ఉండటంతో.. ఎవరూ విందుకు హాజరుకాలేకపోయారు. అప్పుడు ఆ పెద్దాయన బీదసాదలను పిలిచి.. వారికి కడుపు నిండా విందు భోజనం పెట్టి పంపాడు. పేదల ఆకలి తీర్చానన్న తృప్తితో ఆ యజమాని ఎంతో సంతోషించాడు. ప్రభువు దృష్టిలో అదే ఘనమైన విందు.

- ఎం.సుగుణరావు

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు