భగినీహస్త భోజనమంటే..

యమ ద్వితీయ అంటే ఏమిటి? ఆ రోజు అన్నదమ్ములు.. సోదరి ఇంట భోజనం చేయాలంటారు ఎందుకు? ​​​​​​​

Published : 01 Nov 2018 10:52 IST

భగినీహస్త భోజనమంటే..

యమ ద్వితీయ అంటే ఏమిటి? ఆ రోజు అన్నదమ్ములు.. సోదరి ఇంట భోజనం చేయాలంటారు ఎందుకు?

   - నాగతారిణి, మహబూబ్‌నగర్‌

దీపావళి పండగ తర్వాత రెండు రోజులకు వచ్చే కార్తీక శుద్ధ విదియను యమద్వితీయగా చేసుకుంటారు. ఇది అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని తెలిపే పండగ. పురాణ కథలను అనుసరించి యముడికి ఒక సోదరి ఉన్నది. ఆమె పేరు యమి. సోదరి మనసులోని కూడని ఆలోచనలను పోగొట్టి యముడు ఆమెకు ధర్మాన్ని తెలియజెప్పిన రోజు ఇదేనని అంటారు.  ఆనాడు యముడు తన సోదరి ఇంట భోజనం చేశాడని కథ ప్రచారంలో ఉంది. నాటి నుంచి యమద్వితీయ పండగగా వాడుకలోకి వచ్చింది. ఆనాడు భగినీ (సోదరి)హస్త భోజనం ఒక ఆచారంగా స్థిరపడింది. అన్నదమ్ములు సోదరి ఇంటికి వెళ్లి ఆమె యోగక్షేమాలు తెలుసుకొని.. అక్కడ భోజనం చేసే ఈ ఆచారం సామాజికంగా, కుటుంబపరంగా చాలా ప్రయోజనకరమైనది. తోడబుట్టిన వారి మధ్య అనుబంధాలు తగ్గిపోతున్న ప్రస్తుత కాలంలో.. సంవత్సరంలో ఒక్కనాడైనా సోదరి యోగక్షేమాలు విచారించాలని ఈ పండగ గుర్తు చేస్తోంది.

- మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని