కలశంపై కొబ్బరికాయ ఎందుకు?

వ్రతాలు, ప్రత్యేక పూజలు చేసే సమయంలో కలశ స్థాపన ఎందుకు చేస్తారు? కలశంపై ఉంచిన కొబ్బరికాయను తర్వాత ఏం చేయాలి?

Published : 27 Dec 2018 00:23 IST

కలశంపై కొబ్బరికాయ ఎందుకు?

వ్రతాలు, ప్రత్యేక పూజలు చేసే సమయంలో కలశ స్థాపన ఎందుకు చేస్తారు? కలశంపై ఉంచిన కొబ్బరికాయను తర్వాత ఏం చేయాలి?

- హరిత, వరంగల్‌

 

మన సంప్రదాయంలో వ్రతాల వంటివి చేసే సందర్భంలో ఏర్పాటు చేసే కలశం ఈ సృష్టికి ప్రతీక. ‘‘కలశస్య ముఖే విష్ణుః..’’ ఇత్యాది మంత్రాలు ఈ విషయాన్ని వివరిస్తున్నాయి. కలశంపై అమర్చే కొబ్బరికాయ కూడా బ్రహ్మాండానికి కలశంపై కొబ్బరికాయ ఎందుకు?సంకేతం. కొబ్బరికాయ పూర్ణఫలం. అదే కాయ, అదే విత్తనం కూడా! మనం అర్చించే దైవం సృష్టిలో అంతటా నిండి ఉన్నాడని, అంతటా ఉన్న పరమాత్మకు ప్రతీకగా ఏదో ప్రతిమను మనం ఏర్పాటు చేసుకున్నామని కొబ్బరికాయ అమర్చిన కలశం తెలియచేస్తోంది. వ్రతపరిసమాప్తి తర్వాత వినియోగించిన అన్ని పూజాద్రవ్యాలతోపాటు కలశంపై కొబ్బరికాయను కూడ నిమజ్జనం చేయాలి.

- మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు