ఐశ్వర్య ప్రదాతకు అన్నపూజ

ఇష్టదైవానికి అన్నంతో అర్చన చేయటం అన్నపూజ. అన్నం పరబ్రహ్మ స్వరూపమనీ, పరమాత్మకు ప్రీతిపాత్రమనీ వేద వాఙ్మయం చెబుతోంది. అలాంటి అన్నంతో ఇష్టదైవాన్ని ఆరాధించడమే అన్నపూజ. అన్నంతో అభిషేకం చేస్తూ అన్నసూక్తం పఠించడం సంప్రదాయం....

Published : 18 Apr 2019 00:27 IST

ధర్మసందేహం

శివుడికి అన్నపూజ చేస్తారెందుకు?
- వీర్రాజు, బెంగళూరు
ఇష్టదైవానికి అన్నంతో అర్చన చేయటం అన్నపూజ. అన్నం పరబ్రహ్మ స్వరూపమనీ, పరమాత్మకు ప్రీతిపాత్రమనీ వేద వాఙ్మయం చెబుతోంది. అలాంటి అన్నంతో ఇష్టదైవాన్ని ఆరాధించడమే అన్నపూజ. అన్నంతో అభిషేకం చేస్తూ అన్నసూక్తం పఠించడం సంప్రదాయం. తర్వాత అన్న సంతర్పణ చేస్తారు. అన్నాన్ని దైవంగా చూడటం, అందరికీ అన్నం పెట్టడం దైవారాధనగా భావించటమూ ఈ విధానంలోని ఆంతర్యం. అన్నాభిషేకంలో అన్నమే పూజాసామగ్రి. పసుపు కుంకుమలూ పూజాపుష్పాలూ అన్నీ అన్నమే. ఆవాహనం, ధ్యానం, ఆసనం మొదలైన షోడశోపచారాలు సమర్పించి, అష్టోత్తర శతనామావళి, సహస్రనామావళి ఆధారంగా అర్చన నిర్వహిస్తారు. పరమశివుడికి అన్నపూజ నిర్వహిస్తే.. కర్తకు అన్నపానాదులకు లోటుండదని విశ్వాసం.

-మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని