ధర్మ సందేహం

రామభద్రా! అనే పిలుపు ఈనాటిది కాదు. తేత్రాయుగం నాటిది. భద్రశ్చ అసౌ రామః రామభద్రః... భద్రత అంటే శుభాలను ప్రసాదించే రాముడు రామభద్రుడు అని వాల్మీకి రామాయణం చెబుతోంది....

Updated : 25 Apr 2019 00:36 IST

*శ్రీరాముడికి రామభద్రుడనే పేరు ఎలా వచ్చింది?

- శ్రీదేవి, పిఠాపురం

 

రామభద్రా! అనే పిలుపు ఈనాటిది కాదు. తేత్రాయుగం నాటిది. భద్రశ్చ అసౌ రామః రామభద్రః... భద్రత అంటే శుభాలను ప్రసాదించే రాముడు రామభద్రుడు అని వాల్మీకి రామాయణం చెబుతోంది. దృష్టి, జయంతుడు, విజయుడు, అశోకుడు, సిద్దార్థుడు, అర్థసాధకుడు, మంత్రపాలుడు, సుమంత్రుడు అనే ఎనిమిది మంది అయోధ్యలో ఆనాటి మంత్రులు. వీరంతా రాముడిని రామభద్రా అని పిలిచేవారని చెబుతారు.

- మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని