అలా అద్భుతాలు జరగవు...
ఐశ్వర్యం కలగాలంటే దైవానుగ్రహం కావాలి. దైవభక్తి, సత్పవ్రర్తన కలిగి ఉండి, సంపదలో కొంత సత్కార్యాల కోసం వినియోగిస్తూ ఉంటే భగవంతుడు
ధర్మసందేహం
యంత్రాలు, లోహంతో చేసిన తాబేళ్లు, చేపలు ఇంట్లో ఉంచుకుంటే అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయన్నది నిజమేనా?
ఐశ్వర్యం కలగాలంటే దైవానుగ్రహం కావాలి. దైవభక్తి, సత్పవ్రర్తన కలిగి ఉండి, సంపదలో కొంత సత్కార్యాల కోసం వినియోగిస్తూ ఉంటే భగవంతుడు అనుగ్రహిస్తాడంటుంది శాస్త్రం. లోహాలతో చేసే తాబేళ్లు అలంకార సామగ్రి మాత్రమే. వాటితో ఏవో అద్భుతాలు జరిగిపోతాయన్నది కేవలం నమ్మకం మాత్రమే. ఇందుకు శాస్త్రీయమైన ప్రమాణం ఏమీ లేదు.
వెండి, రాగి, ఇత్తడి, పంచలోహాలూ మొదలైన వాటితో చేసే యంత్రాలను పూజా మందిరంలో ఉంచి, నిత్య పూజాదికాలు చేసే పద్ధతి ఉంది. ఈ యంత్రాలపై రేఖల రూపంలో, బీజాక్షరాలతో దైవీశక్తిని ఆవాహనం చేస్తారు. యంత్రాల తయారీలో ఎంతో నిబద్ధత, జాగరూకత కావాలి. కేవలం యంత్రంపై రేఖలు, ఆకారం ఉంటే సరిపోదు. సంబంధిత దేవత మంత్రాలను పునశ్చరణ చేసి, యంత్రాలకు ప్రాణప్రతిష్ఠ చేసినప్పుడే వాటిలోని దైవీశక్తి కొలువుంటుంది. అలా చేయని యంత్రాలు అలంకారప్రాయమేనని గుర్తించాలి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
క్యాబ్ డ్రైవర్ ఖాతాలో రూ.9వేల కోట్లు జమ.. కొద్ది రోజులకే బ్యాంకు ఎండీ రాజీనామా..!
-
Chandrababu: చంద్రబాబు బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా
-
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Law Commission: 2024లో జమిలి ఎన్నికలు సాధ్యమేనా..? కొత్త ఫార్ములా రూపొందిస్తున్న లా కమిషన్!
-
Giant wheel: వామ్మో.. సరదాగా జెయింట్ వీల్ ఎక్కితే నరకం కనిపించింది!
-
Japan : మరోసారి పసిఫిక్ మహా సముద్రంలోకి అణుజలాలు విడుదల.. ప్రకటించిన జపాన్