విజయీభవ!
అలగ్జాండర్తో ప్రపంచాన్ని కాదు నిన్ను నువ్వు గెలవమన్నాడు దండామిస్. విజయం ఎవరికైనా ఆనందాన్నిస్తుంది....
అలగ్జాండర్తో ప్రపంచాన్ని కాదు నిన్ను నువ్వు గెలవమన్నాడు దండామిస్. విజయం ఎవరికైనా ఆనందాన్నిస్తుంది...తనను తాను గెలిచిన వారికి ఆనందం శాశ్వతమవుతుంది. అంతటి విజయాన్ని, ఆత్మానందాన్ని సొంతం చేసేది జగన్మాత. అందుకే ఆది శంకరులు జగదంబను ‘నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ’ అంటూ స్తుతించారు. విజయం కోసం ఆదిశక్తిని కొలవాల్సిన రోజు విజయదశమి. ఆ రోజు ఏం చేయాలంటే....
* తొమ్మిది రోజుల పాటు తొమ్మిది రూపాల్లో జగన్మాతను పూజించాలి. నవరాత్రి వ్రతాన్ని పూర్తి చేసిన తర్వాత పదో రోజు ఆమెను అపరాజితాదేవిగా కొలవాలని నిర్దేశించారు. అపరాజిత అంటే పరాజయం లేనిది. సర్వకాలసర్వావస్థల్లో విజయాన్నందిస్తుందీమె. విజయదశమినాటి మధ్యాహ్న సమయంలో అపరాజితా దేవిని ఆవాహన చేసి అష్టోత్తర శతనామాలతో పూజిస్తారు. ‘అపరాజితాయై నమః, జయాయైనమ్, విజయాయై నమః’ అంటూ స్తుతించినా ఆమె కరుణకు పాత్రులవుతారని చెబుతారు.
* సృష్టిక్రమంలో భాగంగా బ్రహ్మ అగ్నిని కూడా సృష్టించాడు. వెంటనే అగ్ని విజృంభించి తన ప్రతాపాన్ని చూపించడం మొదలు పెట్టింది. దీంతో విధాత అగ్నిని శమింపజేసేందుకు పచ్చని జమ్మి చెట్టును సృష్టించి దాని కొమ్మలతో అగ్నిని ఆపాడని పురాణగాథ. అలా శమీ వృక్షం పూజనీయమైంది. శమీవృక్షాన్ని సాక్షాత్తు అపరాజితా దేవి రూపమని కూడా కొందరు చెబుతారు.విజయదశమినాటి సాయంత్రం గ్రామ పొలిమేరలకు ఆవలనున్న జమ్మి చెట్టుకు పూజలు చేస్తారు.
* ద్వాపర యుగంలో పాండవులు అరణ్య, అజ్ఞాతవాసాలను ముగించుకుని వస్తున్న సమయంలో వారికి పాలపిట్ట దర్శనమిచ్చిందని, అప్పటి నుంచి వారికన్నీ విజయాలే లభించాయని చెబుతారు. అప్పటినుంచి విజయ దసమి నాడు ఆ పక్షి దర్శనం శుభసూచకంగా భావిస్తారు.
* దసరా రోజు అందరూ తమ పనిముట్లను శుభ్రపరిచి పూజిస్తారు. విజయదశమి ముందు రోజు మహార్నవమి నాడు ఆయుధపూజ చేసే సంప్రదాయం తమిళనాడులో ఉంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
జగనన్న నవ్వులు.. జనాలకు చుక్కలు
-
కూలీ బిడ్డకు 993 మార్కులు
-
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు
-
ఒకే బైక్‌పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్‌హాట్ డీఐ సస్పెన్షన్ ?