స్నానంలో జిల్లేడు ఆకులు ఎందుకు?

సర్వ జీవులకు ఆయురారోగ్యాలను ప్రసాదించేవాడు సూర్యభగవానుడు. ఆయనను స్మరించే రోజు రథ సప్తమి. సూర్యుడికి అత్యంత ప్రీతికరమైన ఆ రోజు ఏడు జిల్లేడు ఆకులను ధరించి నదీస్నానం చేస్తే మంచిదని చెబుతారు.  జిల్లేడు ఆకులను అర్క

Published : 18 Feb 2021 00:29 IST

ఈనెల 19 రథసప్తమి

ర్వ జీవులకు ఆయురారోగ్యాలను ప్రసాదించేవాడు సూర్యభగవానుడు. ఆయనను స్మరించే రోజు రథ సప్తమి. సూర్యుడికి అత్యంత ప్రీతికరమైన ఆ రోజు ఏడు జిల్లేడు ఆకులను ధరించి నదీస్నానం చేస్తే మంచిదని చెబుతారు.  జిల్లేడు ఆకులను అర్క పత్రాలంటారు. అర్కుడు అంటే సూర్యుడు. సంప్రదాయ వైద్యవిధానంలో విశిష్ట స్థానం ఉన్న రథ సప్తమినాడు ఈ పత్రాలను  శిరసున పెట్టుకుని స్నానం చేయాలి.
ఆ సమయంలో గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతీ నర్మదా సింధు కావేరి జలేస్మిన్‌ సన్నిధిం కురు అనే మంత్రం చదవాలన్నది  శాస్త్రవచనం. దీని వెనక ఆధ్యాత్మిక, ఆరోగ్య రహస్యాలున్నాయి. ఈ స్నానం వల్ల మానసిక, వాచిక, శారీరక కర్మల వల్ల వచ్చిన వ్యాధులు నశిస్తాయంటారు.

-యల్లాప్రగడ మల్లికార్జునరావు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని