బ్రహ్మకు ఆలయాలు ఎందుకు లేవు?

ఇతర దేవుళ్లకు ఆలయాలున్నాయి కానీ బ్రహ్మదేవుడికి లేవు. ఎందుకు లేవో చెప్పే కథ ఒకటి ప్రచారంలో ఉంది. ఒకసారి బ్రహ్మ, విష్ణువులకు తామిద్దరిలో ఎవరు గొప్ప అనే సందేహం వచ్చింది. అప్పుడు శివుడు

Published : 09 Dec 2021 00:38 IST

ఇతర దేవుళ్లకు ఆలయాలున్నాయి కానీ బ్రహ్మదేవుడికి లేవు. ఎందుకు లేవో చెప్పే కథ ఒకటి ప్రచారంలో ఉంది. ఒకసారి బ్రహ్మ, విష్ణువులకు తామిద్దరిలో ఎవరు గొప్ప అనే సందేహం వచ్చింది. అప్పుడు శివుడు అగ్నిస్తంభ లింగాకృతిలో ప్రత్యక్షమై తన ఆద్యంతాలు ఎవరు ముందుగా కనుక్కోగల్గితే వారే గొప్ప అన్నాడు. బ్రహ్మ లింగానికి పైవైపు, విష్ణువు కిందివైపు అన్వేషిస్తూ వెళ్లారు. విష్ణుమూర్తి తిరిగొచ్చి, తాను ఈశ్వరుని అంతం కనిపెట్టలేకపోయానని ఒప్పుకున్నాడు. కానీ బ్రహ్మదేవుడు శంకరుని ఆది కనుగొన్నానని మొగలిపూవు, గోవులతో అబద్ధపు సాక్ష్యం చెప్పించాడు. దాంతో ఆగ్రహించిన మహాశివుడు ‘నీకు భూలోకంలో ఆలయాలు, నోములు, పూజలు ఉండవు’ అంటూ బ్రహ్మను శపించాడు. అందుకే బ్రహ్మకు ఆలయాలు లేవు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని