అన్నమయ్య మనో వైద్యుడు

కుల, మత, జాతి వివక్షను ఖండిస్తూ, ప్రజల మనసుల్లో శాంతి, ప్రేమ, అహింస, భక్తి, సమత్వ బీజాలను నాటినవాడు అన్నమయ్య. ఆయన సంఘ సంస్కర్తే కాదు తన కీర్తనలతో మానసిక సాంత్వన కూడా ఇచ్చాడు. ‘చలపాది రోగమీసంసారము...

Published : 24 Feb 2022 00:25 IST

కుల, మత, జాతి వివక్షను ఖండిస్తూ, ప్రజల మనసుల్లో శాంతి, ప్రేమ, అహింస, భక్తి, సమత్వ బీజాలను నాటినవాడు అన్నమయ్య. ఆయన సంఘ సంస్కర్తే కాదు తన కీర్తనలతో మానసిక సాంత్వన కూడా ఇచ్చాడు.
‘చలపాది రోగమీసంసారము నేడు, బలువైన మందు విష్ణుభక్తి జీవులకు..’ అన్నాడు. అంటే సంసారమంటేనే పగ ప్రతీకారం.. దానికి మందు శ్రీమన్నారాయణుడే అన్నాడు. ఇంకా ‘వేదవేద్యులు వెదకేటి మందు, ఆదినంత్యములేని ఆ మందు’ అనీ, ‘కొనరో కొనరో మీరు కూరిమిమందు, వునికి మనికి కెల్ల నొక్కటే మందు’ అనీ, ‘సకలజీవులకెల్ల సంజీవి యీమందు, వెకలులై యిందరు సేవించరో యీమందు’ అంటూ జీవులకు సంజీవి విష్ణునామమే అని స్పష్టంచేశాడు. మరో సందర్భంలో ‘లేదు భయము మరి కాదు భవము, ఆదియు నంత్యము దెలిసిన హరియాజ్ఞే కాన’ అంటూ భయపడనవసరం లేదని తెలియజెప్పాడు. త్రికరణశుద్ధిగా భగవంతుణ్ణి నమ్మి పూజిస్తే, ఆత్మశుద్ధి జరిగి సర్వ రోగాలు నయమవుతాయని ప్రబోధించిన గొప్ప మనో వైద్యుడు, తత్త్వవేత్త అన్నమయ్య.

- డాక్టర్‌ టేకుమళ్ల వెంకటప్పయ్య


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని