ఆత్మ రూపం

ఆత్మ రూపం అంటే ఏమిటో వివరించమని రమణులను అడిగారొకరు.

Updated : 27 May 2022 17:17 IST

ఆత్మ రూపం అంటే ఏమిటో వివరించమని రమణులను అడిగారొకరు.

‘శరీరానికి అన్వయించే నేను అనే భావనను వ్యక్తిగతమైన అహం అంటాం. ఇది మనసు చేసే భావన కనుక.. దీనికి ఉనికి లేదు. అలా కాకుండా ఆత్మ నుంచి పుట్టే నేను అనే అహాన్ని తెలుసుకుంటే వ్యక్తిగత అహం పారిపోయి స్వచ్ఛమైన ఆత్మ అనేది అనుభవానికి వస్తుంది. అంటే దేవుడు-నేను వేరు కాదు ఒకరే అనే జ్ఞానం కలుగుతుంది. భౌతిక కోరికల ఉనికిని పట్టించుకోవడం ఎప్పుడు మానేస్తావో అప్పుడు ఆత్మ గురించి నిజమైన ఎరుక కలుగుతుంది. చాలామంది ఆత్మను వెలుగుగా వర్ణిస్తుంటారు. ఆత్మ వెలుగూ కాదు, చీకటీ కాదు. కృష్ణుడి బోధను బట్టి ఆత్మ స్వరూపమన్నది ఇంద్రియజ్ఞానానికి అంతుపట్టేదీ, వర్ణనకు సాధ్యమయ్యేదీ కాదని తెలుస్తుంది. దృశ్యానికీ దృష్టికి అతీతమైనదే ఆత్మ. దీనిని చూడటం అంటే కళ్లతో చూడటం కాదు. జ్ఞానంతో అనుభూతిని చెందడం అని గ్రహించాలి. నేను అనేది శరీరం అనుకుంటే.. ఆత్మలు కూడా అనేకం. కానీ అనేక ఆత్మలతో అనేక రూపాలు ధరించేవాడు ఒక్కడే. అందుకే బ్రహ్మమొక్కటే అన్నారు. దేహానికి ఉన్నట్టుగా ఆత్మకు నిద్ర-మెలకువ-కల అనే మూడు భిన్నమైన స్థితులు ఉండవు. తెరపై కదలాడే చిత్రాలు తెరకు అంటిపెట్టుకొని ఉండనట్లే ఆత్మ ఈ మూడు స్థితులకూ అతీతమైనది. మనసును అంతర్ముఖంగా ఉంచితే ఆత్మజ్ఞానం. బయటి విషయాల మీదికి మళ్లిస్తే ప్రపంచ జ్ఞానం’ అంటూ వివరించారు మహర్షి తనదైన అరనవ్వుతో.

- జయదేవ్‌ చల్లా


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని