దేవుడెప్పుడు కరుణిస్తాడు?

ఒక భక్తుడు రమణ మహర్షిని ఉద్దేశించి ‘స్వామీ! నేనెంతగా ప్రార్థన చేస్తున్నా దేవుడు నాకు సహాయం చేయడం లేదు’ అన్నాడు. దానికి రమణుల వారు ‘విశ్వాసం, శరణాగతి అనే రెండు విషయాలు దేవుణ్ణి తొందరగా భక్తుడి వద్దకు

Published : 14 Apr 2022 01:40 IST

రమణీయం

ఒక భక్తుడు రమణ మహర్షిని ఉద్దేశించి ‘స్వామీ! నేనెంతగా ప్రార్థన చేస్తున్నా దేవుడు నాకు సహాయం చేయడం లేదు’ అన్నాడు. దానికి రమణుల వారు ‘విశ్వాసం, శరణాగతి అనే రెండు విషయాలు దేవుణ్ణి తొందరగా భక్తుడి వద్దకు తీసుకెళతాయి. అయితే ఈ రెండూ ఒకదాని మీద మరొకటి ఆధారపడి ఉన్నాయి. ఒక కంటితో చూసే దృశ్యానికీ, రెండు కళ్లతో చూసేదానికీ స్పష్టతలో తేడా ఉంటుంది. కానీ ఎక్కువమంది ఒక దానితో మాత్రమే దేవుణ్ణి కొలుస్తుండటం వల్ల ఆయన చేసే సహాయం ఆలస్యమవుతుంది. తమాషా ఏమంటే ప్రార్థన తర్వాత గొప్ప జ్ఞానులకు మల్లే అంతా దైవేచ్ఛ అనే పదాన్ని పలుకుతున్నారు. అడిగింది దేవుడు తీర్చలేదంటే.. మీరు దైవేచ్ఛను అంగీకరించడం వల్లనే అని గ్రహించండి. సాయం చేసినా, చేయకున్నా కూడా విశ్వాస శరణాగతులను విడవకూడదు. కోరుకున్నది వెంటనే జరగాలని ప్రార్థిస్తే శరణాగతి లోపించినట్లు. అలా కాకుండా నాకు అర్హత ఉంటే నే కోరింది లభిస్తుంది’ అనుకుని హృదయపూర్వకంగా నమస్కరించి దేవుని తీర్పు కోసం ఎదురుచూస్తే అది నిజమైన శరణాగతి అనిపించుకుంటుంది. మీకు ఏం కావాలో, ఎప్పుడు కావాలో అనే విషయాలు దేవుడికి తెలుసు కదా’ అంటూ వివరించారు మహర్షి.

- శ్రావణి 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని