Updated : 27 May 2022 17:22 IST

వెతకాల్సిన చోటు

కాశీరాం అనే వ్యక్తికి వైద్యంచేసినందుకు సాయిని ఇబ్బందిపెట్టాలనుకున్నాడు గ్రామపెద్ద. సాయి అడవిదొంగల ముఠా నాయకుడంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు దొంగల గుంపును విచారించగా సాయి తమ గురువన్నారు. పోలీసు అధికారి సాయిని కలిసి ‘ఈ దొంగలకి నాయకుడివి నువ్వేనటగా’ అన్నాడు. అప్పుడు దొంగలు కల్పించుకుని ‘సాయి మాకు సన్మార్గం చూపిన గురువు అన్నామయ్యా! గురువుకీ నాయకుడికీ తేడా ఉంది కదా’ అన్నారు. అక్కడ చేరిన షిర్డీ ప్రజలు సాయి మహోన్నత వ్యక్తి అని చెప్పడంతో అధికారి బిత్తరపోయాడు. కోపగించిన గ్రామపెద్ద ‘ఇదంతా అబద్ధం. ఆంగ్లేయులకు వ్యతిరేకంగా కుట్ర జరుగుతోంది’ అన్నాడు. అది విన్న అధికారి ‘సాక్ష్యం ఉంటే గానీ సాయిని నిర్బంధించలేం. లేదంటే మా ఉద్యోగాలు ఊడతాయి. ఏమైనా ఆధారాలు ఉంటే చూపండి’ అన్నాడు. 


వెంటనే గ్రామపెద్ద తన సేవకుల్లో ఒకరికి మసీదు వెనుక మందుగుండు పొడి ఉన్న పెట్టెను భూమిలో దాచి, దొంగ సాక్ష్యంగా చూపమని పురమాయించాడు. పథకం ప్రకారం అందరినీ వెంట పెట్టుకుని నేరుగా మసీదు వెనక్కు వెళ్లి అక్కడ తవ్వమన్నాడు. సేవకుడు దాచిన పెట్టె బయటపడింది. కానీ అందులో మందుగుండుకు బదులుగా బంతిపూలు కనిపించాయి. సాయి నవ్వి ‘కాలం కలిసి రాకుంటే మణి మాణిక్యాలకు బదులు కుసుమాలే లభిస్తాయి. మీరు మనసులో గనుక అన్వేషిస్తే దైవమనే అమూల్య నిధి దొరికేది’ అన్నాడు. అధికారి సాయిని క్షమాపణ కోరి అక్కణ్ణించి వెళ్లిపోయాడు.                 

- పద్మజ 


Advertisement

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని