మంచివాళ్లకి కష్టాలెందుకు?!

బాయిజాబాయి సాయికి భోజనం వడ్డిస్తూ- ‘సాయీ! ధర్మంగా జీవించేవారికే ఎక్కువ కష్టాలుంటున్నాయి.. ఎందుకలా?’ అంది. సాయి నవ్వి ‘ఈ ప్రశ్న చాలామంది, అడిగారు.

Updated : 27 May 2022 17:14 IST

బాయిజాబాయి సాయికి భోజనం వడ్డిస్తూ- ‘సాయీ! ధర్మంగా జీవించేవారికే ఎక్కువ కష్టాలుంటున్నాయి.. ఎందుకలా?’ అంది. సాయి నవ్వి ‘ఈ ప్రశ్న చాలామంది, అడిగారు. ఇదేం జటిలమైంది కాదు. మనలో సత్వ రజో తమో గుణాలు ఉంటాయి. అయితే ఒక్కొక్కరిలో ఒక్కో గుణం పాలు అధికంగా ఉంటుంది. ధర్మం, న్యాయం, సత్యం- అనే విషయాలను సత్వగుణులు ఒకలా, రజోగుణులు ఇంకోలా, తమోగుణులు మరింత భిన్నంగా అర్థం చేసుకుంటారు. అసలు నిజం ఒకటే అయినా మూడు రకాలుగా చూస్తున్నారు. అందుకే ఇన్నిన్ని భేదాలూ, విభేదాలూనూ. ఈ సత్యాన్ని అర్థంచేసుకుంటే ఘర్షణలతో పనే ఉండదు. సామరస్యం, సౌభ్రాతృత్వం వెల్లివిరుస్తుంది. ప్రస్తుతం మంచిగా ఉన్నంతలో సరిపోదు. గతంలో ఎవరికైనా హాని చేసి ఉంటే.. ఆ చెడు కర్మల ఫలం ఇప్పుడు వెంటాడుతుంది. ఆ బాధను అంటే కష్టాల తీవ్రతను తట్టుకుని నిలబడాలంటే మన వల్ల ఇక్కట్లపాలైన వారిని క్షమించమంటూ అభ్యర్థించాలి. ఒకవేళ వాళ్లు లేకుంటే.. వారి కుటుంబసభ్యులను వెతుక్కుంటూ వెళ్లి చేతనైన సహాయం చేయాలి’ అంటూ వివరించాడు బాబా.

- పద్మజ


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని