ఇల్లు కూల్చి మస్జిద్‌

ఈజిప్టు పాలకుడు అమ్‌బ్రిన్‌ ఆస్‌ గురించి హజ్రత్‌ ఉమర్‌(ర) చక్రవర్తికి ఫిర్యాదు చేసిందో మహిళ. తమకు చెప్పకుండా తమ ఇంటిని కూల్చి మస్జిద్‌లో కలిపేశారన్నది సారాంశం.

Updated : 27 Oct 2022 01:26 IST

ఈజిప్టు పాలకుడు అమ్‌బ్రిన్‌ ఆస్‌ గురించి హజ్రత్‌ ఉమర్‌(ర) చక్రవర్తికి ఫిర్యాదు చేసిందో మహిళ. తమకు చెప్పకుండా తమ ఇంటిని కూల్చి మస్జిద్‌లో కలిపేశారన్నది సారాంశం. దానికి సంజాయిషీ అడిగారు ఖలీఫా. ‘నమాజుకు వస్తున్న వారి సంఖ్య పెరిగి మస్జిదు ఇరుకైపోయింది. పక్కనే ఆమె ఇల్లు ఉన్నందున దాని విలువకట్టి ధర చెల్లిస్తామంటే ఒప్పుకోలేదామె. దాంతో బలవంతంగా ఇంటిని పడగొట్టి మస్జిదులో కలిపేయాల్సి వచ్చింది. ఇంటి విలువకు తగిన సొమ్మును ఆమె ప్రభుత్వం నుంచి తీసుకోవచ్చు’ అంటూ అధికారి చెప్పిన సంజాయిషీ ఉమర్‌(ర)కు నచ్చలేదు. ఆమె స్థలంలో నిర్మించిన మస్జిద్‌ భాగాన్ని కూల్చి ఇంటిని పునర్నిర్మించి ఇవ్వమని ఆదేశించారు.         

 - ఖైరున్నీసాబేగం


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు