కృష్ణోపదేశం

మహావీరుడైన అర్జునుడు చేతులు కంపిస్తుండగా ‘ఈ మనసు చంచలమైంది, అల్లకల్లోలమైంది, బలమైంది, మూర్ఖపు పట్టుగలది.

Updated : 10 Dec 2022 19:47 IST

మహావీరుడైన అర్జునుడు చేతులు కంపిస్తుండగా ‘ఈ మనసు చంచలమైంది, అల్లకల్లోలమైంది, బలమైంది, మూర్ఖపు పట్టుగలది. దీన్ని నిగ్రహించటం వీచేగాలిని అదుపుచేయటం కన్నా కష్టం కృష్ణా’ అన్నాడు. చేతిలో ఉన్న విల్లు కింద పడింది. అతణ్ణలా వైరాగ్యస్థితిలో చూస్తూ ‘దక్కే ఫలితం నీ చేతుల్లో లేదు. కాబట్టి దాని గురించి ఆలోచించకు. చేసే పని మాత్రమే నీ అధీనంలో ఉంది. నువ్వు మొదలుపెట్టింది పూర్తిచెయ్యి. చేస్తున్న పని మీదే దృష్టి నిలిపితే ఫలితం గురించీ, ఎదురయ్యే పరిస్థితులూ, పరిణామాల గురించీ ఆలోచన ఉండదు. మనం ఎంత బలవంతులం అన్నది ముఖ్యం కాదు మనసు ఎంత బలంగా ఉందనేదే ముఖ్యం’ అంటూ హితబోధ చేశాడు కృష్ణుడు.

- కరణం నవ్యశ్రీ


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని