కేశవః

విష్ణుసహస్రనామావళిలో ఇది 23 వది. సుందర కేశాలతో విరాజిల్లువాడు, అందమైన కిరణాలతో విశ్వాన్ని చైతన్యవంతంగా చేసేవాడు అనే అర్థాలున్నాయి.

Updated : 14 Dec 2022 12:20 IST

విష్ణుసహస్రనామావళిలో ఇది 23 వది. సుందర కేశాలతో విరాజిల్లువాడు, అందమైన కిరణాలతో విశ్వాన్ని చైతన్యవంతంగా చేసేవాడు అనే అర్థాలున్నాయి. ఆయన అందానికి ప్రతీకగా కనిపించే ఈ నామం మరో విశేషాన్ని కూడా ప్రకటిస్తుంది. సూర్య కిరణాల్లో హరికేశాలనే కిరణాలున్నాయి. అలాగే కేశ అనే రాక్షసుణ్ణి సంహరించి లోకాలకు క్షేమాన్ని ప్రసాదించాడనే విషయాన్ని కూడా ఈ నామం వ్యక్తపరుస్తుంది. మరింతగా విశ్లేషిస్తే క+అ+ఈశ కలసి కేశ శబ్దం ఏర్పడుతుంది. ఇక్కడ క అంటే బ్రహ్మ, అ అంటే విష్ణువు, ఈశ అంటే ఈశ్వరుడు. ఇలా త్రిమూర్తులకు ఆధారమైన వాసుదేవ చైతన్యమే కేశవుడు అనే వివరణ కూడా ఈ నామంలో కనిపిస్తుంది.

- వై.తన్వి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని