జాప్యం కూడదు!

ఈ భర్తృహరి సుభాషితానికి లోతైన అర్థం ఉందంటూ విద్యాప్రకాశానంద స్వామి ఒక కథను ప్రస్తావించారు. ఒక పల్లెలో మంటలు వ్యాపించడంతో జనమంతా గుమిగూడారు.

Published : 12 Jan 2023 00:27 IST

ఆత్మశ్రేయసి తావ దేవ విదుషా కార్యః ప్రయత్నో మహాన్‌
సందీప్తే భవనే తు కూపఖననం ప్రత్యుద్యమః కీదృశః

ఈ భర్తృహరి సుభాషితానికి లోతైన అర్థం ఉందంటూ విద్యాప్రకాశానంద స్వామి ఒక కథను ప్రస్తావించారు. ఒక పల్లెలో మంటలు వ్యాపించడంతో జనమంతా గుమిగూడారు. ఇళ్లమీద తాటాకులను తీసేస్తే మంటలు ఆరిపోతాయని ఒకరు, పొరుగూరి జనాల్ని కూడా పిల్చుకొస్తే అది సాధ్యమని ఇంకొకరు, ఇంతమంది ఉన్నాం చెరువు నుంచి నీళ్లు చేదుకొచ్చి మంటలు ఆర్పుదామని మరొకరు అన్నారు. చాలాసార్లు ఇలాంటి పరిస్థితే ఎదురౌతుంది కనుక కష్టంగా, క్లిష్టంగా ఉంటుంది. ఇళ్లల్లో ఉన్న నీళ్లతో మంటలార్పే తక్షణచర్యకు బదులు కాలయాపనలు పరిపాటి. తొమ్మిది ద్వారాల దేహ పంజరం నుంచి ప్రాణమనే హంస ఎప్పుడెలా ఎగిరిపోతుందో చెప్పలేం. అందుకే జాప్యం కూడదు. వ్యాధులు, కష్టాలు, వియోగాలు, సంయోగాలు చుట్టిముట్టి దైవస్మరణకు చాలా సమయం ఉందిలెమ్మనిపిస్తుంది. ఇది మంటలార్పడానికి బదులు మంతనాలు చేయడం లాంటిదే. ఆలోపు ఎన్నిళ్లు కాలిపోతాయో కదా! అందుకే ఆలస్యం.. అమృతం విషం- అన్నారు. ఇలా సమయం వృథా చేసేవారే దీర్ఘ సూత్రులు. తక్షణం సర్వేశ్వరుణ్ణి ఆశ్రయిస్తే భవరోగాలు దూరమవుతాయి. అమూల్యం, క్షణికం అయిన ఈ జీవితాన్ని దైవం కోసమే వెచ్చించాలి. - పద్మజ


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని