స్వస్థత చేకూర్చే శ్లోకం

వ్యాకరణ, తర్క, మీమాంసల్లో దిట్ట అయిన మహా పండితుడు శ్రీ మేల్పత్తూర్‌ నారాయణ భట్టాత్రి గురువాయూరప్పన్‌(శ్రీకృష్ణుడు) భక్తుడు.

Published : 19 Jan 2023 00:13 IST

వ్యాకరణ, తర్క, మీమాంసల్లో దిట్ట అయిన మహా పండితుడు శ్రీ మేల్పత్తూర్‌ నారాయణ భట్టాత్రి గురువాయూరప్పన్‌(శ్రీకృష్ణుడు) భక్తుడు. ఒకసారి భట్టాత్రికి చదువు చెప్పిన గురువు అనారోగ్యం పాలయ్యాడు. ఆయన వేదన చూడలేక ఆ జబ్బును తనకు ఇవ్వ మని, దాని వల్ల కలిగే బాధను తాను అనుభవిస్తా నని, అదే గురువుగారికి సమర్పించే గురుదక్షిణగా భావిస్తానని ప్రార్థించాడు. కృష్ణుడి దీవెనతో గురువుకు జబ్బు నయమై, భట్టాత్రికి ప్రాప్తించింది. ఆ బాధ నుంచి ఉపశమనం కోసం భాగవతాన్ని 1035 శ్లోకాలతో ‘నారాయణీయం’ రచించగా.. శ్రీకృష్ణుడు సాక్షాత్కరించి సంపూర్ణ ఆరోగ్యవంతుణ్ణి చేశాడు. అప్పటి నుంచి దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వారు ‘నారాయణీయం’ గ్రంథాన్ని పఠించి వ్యాధి నుంచి విముక్తులవుతున్నారు. ‘అన్ని శ్లోకాలనూ చదవలేనివారు 8వ దశకంలోని

అస్మిన్‌ పరాత్మన్‌ నను పాద్మకల్పే
త్వమిత్థ ముత్థాపిత పద్మయోనిః
అనంత భూమా మమ రోగరాశిం
నిరుంధి వాతాలయ వాస విష్ణోః

అనే 13వ శ్లోకాన్ని రోజుకు 108 సార్లు చొప్పున భక్తిశ్రద్ధలతో పఠించి ఉపశమనం పొందవచ్చు’ అని పరమాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి ప్రవచించారు.  

పరాశరం సచ్చిదానంద మూర్తి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని