త్రికాలజ్ఞుడు వేదవ్యాసుడు

త్రికాలజ్ఞుడైన వ్యాసమహర్షి భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాడు. కాలం గడిచేకొద్దీ మానవాళికి అనేక సౌకర్యాలు ఏర్పడుతున్నాయి.

Published : 19 Jan 2023 00:13 IST

త్రికాలజ్ఞుడైన వ్యాసమహర్షి భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాడు. కాలం గడిచేకొద్దీ మానవాళికి అనేక సౌకర్యాలు ఏర్పడుతున్నాయి. శరీరానికి శక్తి సన్నగిల్లుతోంది. కలియుగంలో మనుషులు ధైర్యశూన్యులు, అల్పాయుష్కులు, దుర్బలులై ఉంటారు. ఈ కారణంగా నాలుగు వేదాలను రాశిగా చదవడం కష్ట సాధ్యం. కానీ వేదాలను గనుక పఠించక పోతే పవిత్ర వేదకర్మలు, యజ్ఞయాగాలు ఆచరించలేరు అనిపించింది. ఆ వెంటనే నలుగురు హోతలతో (రుగ్వేదం తెలిసినవారు) అనుష్టింపదగిన యజ్ఞాలు ఆగిపోకుండా కొనసాగేలా చేయాలనుకున్నాడు. రుగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం- అంటూ నాలుగుగా విభజించి సులభంగా అధ్యయనం చేసేలా వీలు కల్పించాడు. తన శిష్యగణంలో ముఖ్యులైన పైలుడు, వైశంపాయనుడు, జైమిని, సుమంతుల ద్వారా వేదాలు ప్రజలకు చేరేలా అనుకూలపరిచాడు. ఇలా వేదరాశిని విభజించిన కారణంగా వ్యాస మహర్షి వేదవ్యాసుడుగా కీర్తిగాంచాడు.

బాల కౌసల్య


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని