సంభవః

విష్ణుసహస్రనామావళిలో ఇది 31 వది. సంభవామి యుగేయుగే అని గీతలో స్వామి చెప్పినదానికి ఇది నిలువుటద్దం.

Published : 19 Jan 2023 00:13 IST

విష్ణుసహస్రనామావళిలో ఇది 31 వది. సంభవామి యుగేయుగే అని గీతలో స్వామి చెప్పినదానికి ఇది నిలువుటద్దం. కర్మముల వంటి ఏ ఇతర కారణాల వల్లా బంధనాలు పొందక భక్తుల, ధర్మ సంరక్షణ కోసం తనకు తానుగానే అవతరించేవాడు- అన్నది ఈ నామానికి అర్థం. భక్తుల విషయానికొస్తే  శ్రద్ధా భక్తులతో కోరుకున్నవారికి కోరుకున్నప్పుడు దర్శనమిచ్చే దయామూర్తి శ్రీమహా విష్ణువు అనే విషయాన్ని ఈ నామం స్పష్టం చేస్తుంది.

వై.తన్వి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని