భారతంలో మహాత్ముడు

రామాయణ భారతాల్లో ఏ పాత్ర విశిష్టత దానిదే. దేనికదే ప్రత్యేకమైంది. కానీ కర్ణుడు అనుభవించిన సంఘర్షణ మరెవరూ అనుభవించలేదంటే అతిశయోక్తి కాదు. కన్నతల్లి పుట్టగానే వదిలేసింది.

Published : 26 Jan 2023 00:12 IST

రామాయణ భారతాల్లో ఏ పాత్ర విశిష్టత దానిదే. దేనికదే ప్రత్యేకమైంది. కానీ కర్ణుడు అనుభవించిన సంఘర్షణ మరెవరూ అనుభవించలేదంటే అతిశయోక్తి కాదు. కన్నతల్లి పుట్టగానే వదిలేసింది. అడుగడుగునా అవమానాలు.. ఉన్న ప్రతిభను చాటుకునే అవకాశం లేదు.. తమ్ముళ్లతోనే యుద్ధం చేయాల్సి రావటం.. ఇవన్నీ కర్ణుడికి శాపాలనే చెప్పాలి. కానీ ఎన్నడూ వెనుకడుగేయలేదు.  ఆ దాతృత్వం అనితర సాధ్యం. పుట్టుకతో లభించిన కవచ కుండలాలను దానం చేస్తే ప్రాణానికే ముప్పని తండ్రి సూర్య భగవానుడు హెచ్చరించినా వెనకాడక ఇంద్రుడికి ఇచ్చేశాడు. పాండవుల పక్షానుంటే నువ్వే రాజువని కృష్ణుడు, కుంతీదేవి ఎంత చెప్పినా వినలేదు. ఆ స్నేహమూర్తిని వదలనన్నాడు. కౌరవుల పక్షానుంటే ఓటమి తప్పదు, ప్రాణాలు దక్కవని తెలిసినా వారితోనే ఉన్నాడు. ప్రేమ, దయ, పరాక్రమం, దాతృత్వం, స్నేహానికి ప్రాణమివ్వడం.. అంత గుణ సంపన్నుడు. అందుకే కురుక్షేత్ర యుద్ధంలో అధర్మ పక్షాన నిలిచి కూడా ఆదర్శప్రాయుడయ్యాడు.

రాఘవ గాజుల


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని