Published : 26 Jan 2023 00:29 IST

అహంకారం పతన కారణం

కరోజు సరస్వతీ నదీతీరంలో గోపగోపికలు కృష్ణుడితో కలిసి విహారానికి బయల్దేరారు. అక్కడ యదురాజ నందనుడు శివపూజ చేశాడు. పగలంతా సరదాగా గడిచిపోయింది. పూజలు, ఉపవాసంతో అందరూ అలసి పోయారు. రాత్రికి అక్కడే వండుకుని భోజనం ముగించారు. అలసి నదీతీరంలోనే పవళించారు. అర్ధరాత్రి పెద్ద పాము నందుణ్ణి నోట కరచుకుంది. అతడు హాహాకారాలు చేయడంతో అందరూ మేల్కొన్నారు. కేకలు, ఏడుపులు, నిట్టూర్పులతో దద్దరిల్లిందా ప్రాంతం. యదుకుల భూషణుడు పాముకు పాదఘట్టనం చేశాడు. వెంటనే ఆ ఘటసర్పం విద్యాధరుడిగా రూపు దాల్చి ‘స్వామీ! నేను విద్యాధరుణ్ణి, నాది దేవగణం. సౌందర్యం, బలం, ఉన్నా యన్న గర్వంతో ఒకరోజు గగనవిహారం చేస్తూ తపస్సులో ఉన్న రుషిని చూశాను. అతడు అందహీనంగా కనిపించడంతో చులకనగా నవ్వాను. ఆయన శపించడంతో పాముగా మారాను. ఆ మహర్షి అంగీరసుడని తర్వాత తెలిసింది. అలా భూలోకంలో జీవించలేక క్షమాపణ కోరాను. ఆయన శాంతించి ద్వాపరంలో కృష్ణుడి చరణస్పర్శతో శాపవిమోచనం కలుగుతుందని ఊరడించాడు. ఇప్పుడు నా జీవితం ధన్యమైంది’ అన్నాడు. అహంకారంతో కళ్లు మూసుకుపోతే శృంగభంగం తప్పదంటూ సూరదాసు కృష్ణలీలా విలాసాన్ని ఇలా కళ్లకు కట్టించాడు.

ఉప్పు రాఘవేంద్ర రావు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని