మహర్షి మాతృహృదయం

రమణ మహర్షికి కుంజుస్వామి అనే కేరళ భక్తుడు ఉండేవారు. ఆయనోసారి అరుణాచలం నుంచి స్వగ్రామానికి వెళ్లాలనుకున్నారు.

Published : 23 Feb 2023 00:14 IST

మణ మహర్షికి కుంజుస్వామి అనే కేరళ భక్తుడు ఉండేవారు. ఆయనోసారి అరుణాచలం నుంచి స్వగ్రామానికి వెళ్లాలనుకున్నారు. రైలు చార్జీలకు సరిపడేంత డబ్బే ఉంది. మధ్యలో ఆకలేస్తే ఆహారం కొనుక్కునేందుకూ లేదు. ఎవరినీ నోరు తెరిచి అడగలేక కుంజుస్వామి ఆశ్రమం నుంచి బయల్దేరారు. చివరిగా ప్రణామం చేసుకుని వెళ్దామని మహర్షి సన్నిధికి వచ్చారు. ఇంతలో ఓ భక్తుడు రమణులకు సమర్పించాలని పూరీలు తీసుకొచ్చాడు. మామూలుగా రెండు పూరీలే తీసుకునే మహర్షి ఆ రోజు ఆరు తీసుకున్నారు. వడ్డన అయ్యాక, ఒకటి మాత్రం కంచంలో ఉంచుకుని మిగిలిన ఐదు పూరీలు పొట్లం కట్టారు. దూరంగా నిలబడిన కుంజుస్వామిని పిలిచి ఆ పొట్లాన్ని చేతిలో పెట్టారు. దాన్ని అందుకుని మహర్షి పాదాలపై పడి కన్నీటి పర్యంతమయ్యాడతను. తనేమీ చెప్పకుండానే తన ఆకలిని గ్రహించిన మహర్షి మాతృహృదయానికి చలించిపోయాడు. ‘ఎదుటివారిపై శ్రద్ధ చూపటం ఆధ్యాత్మిక జీవితానికి ప్రథమ సోపానం’ అని బోధించిన రమణులు దాన్ని ఆచరణలో చూపేవారు. అలా కన్నతల్లిలా ఆదరిస్తూ అందరి అవసరాలను గుర్తించి నెరవేర్చేవారాయన.

చైతన్య


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని