నమ్మినవారిని కరుణిస్తాడు

మరియ, మార్తల సోదరుడు చనిపోయాడు. ఆ సంగతి తెలిసిన ఏసు ప్రభువు బాధపడ్డాడు. వారిని పలకరించేందుకు ఆ ప్రాంతాన్ని సందర్శించాడు.

Published : 30 Mar 2023 00:16 IST

మరియ, మార్తల సోదరుడు చనిపోయాడు. ఆ సంగతి తెలిసిన ఏసు ప్రభువు బాధపడ్డాడు. వారిని పలకరించేందుకు ఆ ప్రాంతాన్ని సందర్శించాడు. మరియ వచ్చి ప్రభువు పాదాలపై పడింది. కన్నీరు మున్నీరుగా ఏడ్చింది. ఇతడేం చేయగలడా అని యూదులు విషపు చూపులు చూస్తూ, ఎవరికి తోచినట్లు వారు వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు.

‘మీరు గనుక నమ్మితే దేవుడి మహిమను తప్పక చూడగలరు’ అన్నాడు ఏసు ప్రభువు. అవి మరియకు ఆశా కిరణాలుగా తోచాయి. సమాధి గుహకు వెళ్లారు. రాతిని తొలగించమన్నాడు ప్రభువు. అప్పటికి నాలుగు రోజులు గడిచినందున శవం నుంచి దుర్వాసనలు వచ్చాయి. ఏసు ఆకాశం వంక చూస్తూ ప్రార్థించి ‘చనిపోయిన లాజరూ! లేచి బయటకు రా!’ అంటూ పిలిచాడు. అంతే.. ప్రేత వస్త్ర ధారణతో ఉన్న లాజరు లేచి, అడుగులేస్తూ వచ్చాడు. అది చూసి ఆయన అనుచరులంతా ఆశ్చర్యపోయారు, ఆనందించారు. యూదులు, పరిసయ్యులు కూడా అందరితోబాటు ఆనందించారు. కానీ సనాతనవాదులు కనుక ప్రభువు చేసే గొప్ప పనులను ఆమోదించలేక అసూయ చెందారు.

డా.దేవదాసు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని