గతం గురించి చింతెందుకు?!

మనలో చాలామంది నిన్నటి విషయాలను తలచుకుని బాధపడుతుంటారు. ఈ సందర్భంలో ఏసుక్రీస్తు చెప్పిన ‘నిన్నటి గురించి విచారించొద్దు.

Published : 13 Apr 2023 00:24 IST

మనలో చాలామంది నిన్నటి విషయాలను తలచుకుని బాధపడుతుంటారు. ఈ సందర్భంలో ఏసుక్రీస్తు చెప్పిన ‘నిన్నటి గురించి విచారించొద్దు. ఎప్పటి కీడు అప్పటికి చాలు’ (మత్తయి 6:34) అనే సూక్తిని గుర్తుచేసుకోవాలి. జరిగిన కష్టనష్టాల గురించి పదేపదే తలచుకోవడం వల్ల ఉపయోగం లేకపోగా మనసు కల్లోలం చెందుతుంది. నీ శక్తి గతానికే ధారపోసినట్టవుతుంది. తద్వారా ప్రస్తుతం కుంటుపడుతుంది. కనుక ఈరోజు వీలైనంత మంచిగా జీవించు. చెడుకు దూరంగా ఉండు. అందరి మేలునే కోరుకో. నీ శక్తి సామర్థ్యాలను ఉపయోగించి నీకూ, ఇతరులకూ కూడా శ్రేయస్సు కలిగే పనులు చేయి. వర్తమానం నీ వశంలోనే ఉంటుంది. ప్రభువు చెప్పిన ఈ మంచి మాటను పాటిస్తే మానసిక వ్యథ ఉండదు. అలాగే రేపు ఏం కానుందోనని భయం వద్దు. అందుకు అవసరమైన ప్రణాళికలు రచించుకోవచ్చు. ఆ విషయంలో దేవుని సాయం కోరితే ఆయన తప్పక తోడ్పాటునందిస్తాడు. కానీ ఆందోళన చెందకూడదని భావం.

మర్రి ఎ.బాబ్జీ


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు