స్థిమితంగా ఉందాం..

ఒక జమీందారు మిత్రుణ్ణి కలిసేందుకు గుర్రపు బండి మీద పొరుగూరుకు వెళ్తుంటే ఓ వృద్ధురాలు బరువైన మూటతో రొప్పుతూ మెల్లగా నడుస్తోంది. అతడు జాలిపడి బండి ఎక్కమన్నాడు.

Published : 27 Apr 2023 00:38 IST

క జమీందారు మిత్రుణ్ణి కలిసేందుకు గుర్రపు బండి మీద పొరుగూరుకు వెళ్తుంటే ఓ వృద్ధురాలు బరువైన మూటతో రొప్పుతూ మెల్లగా నడుస్తోంది. అతడు జాలిపడి బండి ఎక్కమన్నాడు. ఆమె ఎక్కింది కానీ మూట దించ లేదు. దాన్ని కూడా బండే మోస్తుందన్నా వినలేదామె. మనలో చాలామంది అలానే వ్యవహరిస్తూ ఉంటాం. ఈ సందర్భంలో ఏసు చెప్పిన ‘ప్రయాసతో భారం మోస్తున్న సమస్త జనులారా! నా వద్దకు రండి, విశ్రాంతి కలిగిస్తాను’ (మత్తయి 11:28) అనే సందేశం గుర్తుచేసుకోవాలి. లోకరక్షకుడైన ఏసుక్రీస్తే మన భారాన్ని మోస్తాననడం ఎంత హర్షణీయం! మన సమస్యలు పరిష్కరించుకోవడానికి అవసరమైనంత జ్ఞానం, వివేకం మనలో లేకపోవచ్చు. కానీ భూత భవిష్యత్‌ వర్తమానాలకు అధిపతి అయిన ఏసుకు అసాధ్యమైంది లేదు కదా! ఆ పనులు నెరవేర్చడానికి ప్రభువు సిద్ధంగా ఉన్నాడు. కనుక మన కష్టనష్టాలను ఏసుకు అప్పగించి స్థిమితంగా ఉందాం.             

 మర్రి ఎ.బాబ్జీ


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని