ధర్మరాజు విచారం

కురుక్షేత్ర సంగ్రామంలో బంధువులందరినీ కోల్పోయిన ధర్మరాజు విచారవదనుడై పొగతో కప్పేసిన అగ్నిలా కనిపించాడు. అది చూసిన శ్రీకృష్ణుడు ‘ధర్మరాజా! అపసవ్య ఆలోచనలను చేసేవారు పతనం చెందుతారు.

Published : 27 Apr 2023 00:37 IST

కురుక్షేత్ర సంగ్రామంలో బంధువులందరినీ కోల్పోయిన ధర్మరాజు విచారవదనుడై పొగతో కప్పేసిన అగ్నిలా కనిపించాడు. అది చూసిన శ్రీకృష్ణుడు ‘ధర్మరాజా! అపసవ్య ఆలోచనలను చేసేవారు పతనం చెందుతారు. ధర్మనిబద్ధతతో సూటిగా ప్రవర్తించేవారు బ్రహ్మలోకం చేరతారు. అటువంటప్పుడు గతించిన వారి గురించి దుఃఖమెందుకు? ఆ బాధను విడిచిపెట్టలేక పోతున్నాం అంటే.. కామ క్రోధాది అంతఃశత్రువులు, శారీరక, మానసిక వ్యాధులూ కారణం. చుట్టూ అనేకమంది బంధు మిత్రులు ఉన్నంతలో ఒరిగేదేమీ లేదు. అయిపోయిన మహా యుద్ధానికి ఆత్మే నిజమైన తోడు, మనసే పెద్ద విరోధి- అని తెలుసుకోవాలి. లోపలి శత్రువును జయించి మనసుకు ప్రశాంతత కలిగించు. మనోజయమంటే శాంతమేనని తెలుసుకో. బయట ఉండే శత్రువులను ఓడించడం కంటే లోపలి శత్రువుల్ని జయించడమే నిజమైన విజయం, అదే మోక్ష మార్గ సాధనలను నేర్పిస్తుంది- అని తెలుసుకోవాలి’ అంటూ ఉపదేశించడంతో ధర్మరాజులో విచారం మాయమైంది.

 నారంశెట్టి ఉమామహేశ్వరరావు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు