మహానిధి

డైజు ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నతి సాధించాలనుకున్నాడు. అందులో భాగంగానే చైనాలో బాసో మాస్టర్‌ వద్దకు వెళ్లి కలిశాడు.కొద్దిసేపు మాట్లాడాక ‘ఇంతకీ నువ్వేం కోరుకుంటు న్నావు?’ నవ్వుతూ అడిగాడు బాసో మాస్టర్‌.

Published : 27 Apr 2023 00:37 IST

డైజు ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నతి సాధించాలనుకున్నాడు. అందులో భాగంగానే చైనాలో బాసో మాస్టర్‌ వద్దకు వెళ్లి కలిశాడు. కొద్దిసేపు మాట్లాడాక ‘ఇంతకీ నువ్వేం కోరుకుంటు న్నావు?’ నవ్వుతూ అడిగాడు బాసో మాస్టర్‌. ‘గొప్ప జ్ఞానాన్ని పొందాలనుకుంటున్నాను’ చెప్పాడు డైజు.‘ఆ నిధి నీలోనే ఉంటుంది.. దాని కోసం బయటెక్కడో ఎందుకు అన్వేషించడం?!’ ఎదురు ప్రశ్నించాడు బాసో. ‘అవునా?! జ్ఞాననిధి నాలో ఉందా? ఎక్కడ మాస్టర్‌?’ ఎంతో ఆత్రుతగా ముందుకు వంగి అడిగాడు డైజు. ‘నువ్వు అడుగుతున్నది మరేంటో కాదు.. జ్ఞాననిధి గురించి’ కళ్లు ఎగరేస్తూ అన్నాడు బాసో. అంతే.. డైజూకి జ్ఞానోదయమయ్యింది. ‘నిజమేగా! తాను జ్ఞానార్జన కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు.. అంటే తనలో దాని పట్ల ఎంతో తపన, తృష్ణ ఉన్నాయి. అదే పెద్ద నిధి కదా’ అనుకున్నాడు. ఆ తర్వాతెన్నడూ జ్ఞానం గురించి ఎవరినీ ఏమీ అడగలేదు. పైగా ఆ విషయమై సందేహాలు వెలిబుచ్చేవారితో ‘మీలో ఉన్న అమూల్య నిధిని తెరిచి చూడండి, దాన్ని సద్వినియోగం చేసుకోండి’ అంటూ చెప్పేవాడు.   

వి.నాగరత్న


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని