సిసలైన దయాసింధువు

కోల్‌కతాలో కాశీశ్వర మిత్ర అనే న్యాయమూర్తి ఇంట్లో ఉత్సవం ఉందని పరమహంసను, వారి శిష్యుల్ని ఆహ్వానించాడు. ప్రార్థన ముగిశాక భోజన ఏర్పాట్లు చేస్తున్నారు.

Updated : 25 May 2023 00:43 IST

కోల్‌కతాలో కాశీశ్వర మిత్ర అనే న్యాయమూర్తి ఇంట్లో ఉత్సవం ఉందని పరమహంసను, వారి శిష్యుల్ని ఆహ్వానించాడు. ప్రార్థన ముగిశాక భోజన ఏర్పాట్లు చేస్తున్నారు. అప్పటికి రాత్రి తొమ్మిదవు తోంది. రామకృష్ణులు దక్షిణేశ్వరానికి తిరిగెళ్లాల్సి ఉంది. కానీ యజమాని ఇతర అతిథుల సత్కార ఏర్పాట్లలో మునిగినందున పరమహంస బృందాన్ని పట్టించుకోలేదు. దాంతో ఆయన శిష్యులు అసహనంతో ‘బాబా! దక్షిణేశ్వరానికి వెళ్లిపోదాం పదండి’ అన్నారు. రామకృష్ణులు శాంతంగా వారిని అనునయించి, వారి పిలుపు కోసం ఎదురుచూస్తున్నారు. ఇంతలో ఆ ఇంటివారు రామకృష్ణుల బృందాన్ని ఒక మూల కూర్చోబెట్టారు. ఆ ప్రదేశం శుభ్రంగా లేదు. వంట బ్రాహ్మణి ఏదో కూర తెచ్చి విస్తళ్లలో వడ్డించింది. అది సహించకపోవడంతో రామకృష్ణులు కాస్త మిఠాయి, ఒక పూరీ తిన్నారు. అయినా దయాసింధువు వారితో ప్రేమగానే మసలుకున్నారు. అంతేకాదు తమ శిష్యులతో ‘ఆతిథ్యం ఇచ్చినవారిపై అసహనం ప్రకటించటం కూడదు. వారు పిన్నవయస్కులు. మర్యాదలు తెలియవు. అంత మాత్రాన భోజనం చేయకుండా వెళ్లిపోతే ఆ కుటుంబానికి అశుభం. పెద్ద మనసుతో వాళ్లని అర్థం చేసుకుని సర్దుకుపోవాలి’ అంటూ ఆతిథ్యాన్ని స్వీకరించి, ఆశీర్వదించి శిష్యసమేతంగా దక్షిణేశ్వరం పయనమయ్యారు.

ప్రహ్లాద్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని