అన్నప్రాశనలో ఆధ్యాత్మిక కోణం

మన హైందవ ధర్మంలో అన్నప్రాశనను వేడుకగా చేయటం సంప్రదాయం. ఆ సమయంలో ఆహారాన్ని ముందుగా భగవంతుడికి నివేదించి, తర్వాత శిశువుకు గోరంత తినిపిస్తారు. ఆరు నుంచి ఏడు నెలల వయసులో చిన్నారులకు ఈ వేడుక నిర్వహిస్తారు.

Updated : 30 May 2024 00:50 IST

న హైందవ ధర్మంలో అన్నప్రాశనను వేడుకగా చేయటం సంప్రదాయం. ఆ సమయంలో ఆహారాన్ని ముందుగా భగవంతుడికి నివేదించి, తర్వాత శిశువుకు గోరంత తినిపిస్తారు. ఆరు నుంచి ఏడు నెలల వయసులో చిన్నారులకు ఈ వేడుక నిర్వహిస్తారు. పవిత్రం, ఆరోగ్యకరం అయిన పదార్థాలను భుజించే అలవాటు చేయటానికే ఈ అన్నప్రాశన ఉత్సవం. ఈ సందర్భానికి సంబంధించిన ప్రార్థన అధర్వ వేదంలో కనిపిస్తుంది. ‘ఓ శిశువా! ఈ అన్నం నీకు తగిన బలాన్నీ, పుష్టినీ ఇచ్చుగాక! వ్యాధులను నశింపజేయు గాక! పవిత్రమైన ఈ ఆహారం పాపాలను పోగొట్టుగాక!’ అనేది ఆ శ్లోక భావం. అలాగే ‘ఆహార శుద్ధౌ సత్త్వ శుద్ధిః’ అంటోంది ఛాందోగ్య ఉపనిషత్తు. అంటే పవిత్రమైన ఆహారాన్ని తీసుకోవటం వల్ల మన శరీరంలో మంచి గుణాలు పెంపొందుతాయి అనేది అర్థం. చిన్పప్పటి నుంచే ఈ సంస్కారాన్ని పాదుకొల్పాలి అన్నదే అన్నప్రాశన ఉత్సవం నిర్వహించడంలోని ఆధ్యాత్మిక కోణం.

చైతన్య 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని