నమో... భూతనాథా!

సూర్యుడిలోని పరమేశ్వర శక్తి పేరు రుద్రుడు. చరాచర జగత్తు పుట్టుకకు ఇతడే కారణం. సకల ప్రాణుల్లో ఉండే జీవం ఈయనే.

Published : 03 Dec 2020 01:05 IST

రుద్రుడు : సూర్యుడిలోని పరమేశ్వర శక్తి పేరు రుద్రుడు. చరాచర జగత్తు పుట్టుకకు ఇతడే కారణం. సకల ప్రాణుల్లో ఉండే జీవం ఈయనే.
భవుడు : నీటిలో ఉండే శివ చైతన్యం భవుడు. సముద్రంపై నావ ఎలా ఉంటుందో అలా మొత్తం జగత్తు ఈ  చైతన్యంలో తేలియాడుతూ ఉంటుంది.
శివుడు : ఇతని స్థానం భూమి. శరీరాన్ని ఎముకలు  పటిష్ట పరిచినట్టు ప్రాణికోటిని భూమిలోని శివశక్తి పట్టి నిలుపుతుంది.
పశుపతి : ఈ పేరుతో పరమేశ్వరుడు అగ్నిలో ఉంటాడు. అందరిలో ఉండే జఠరాగ్ని ఇతని స్వరూపమే. ఇతని భార్య స్వాహాదేవి.
ఈశ్వరుడు : వాయువులోని ఈశ్వర శక్తి. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన అనే అయిదు రూపాల్లో పరమేశ్వర చైతన్యం ఉంటుంది.
భీముడు : ఆకాశంలో పరమేశ్వరుడు భీమ అనే పేరుతో ఉంటాడు. మనిషి శరీరంలో అసంఖ్యాకంగా ఉండే రంధ్రాల్లో ఈశక్తి దాగి ఉంటుంది.
ఉగ్రుడు : యజ్ఞదీక్షలో ఉండే యజమానిని పరమేశ్వరుడు ‘ఉగ్రుడు’ అనే పేరుతో ఆవహించి ఉంటాడు.
మహాదేవుడు : చంద్రుడిలోని శివశక్తి ‘మహాదేవుడు’ అనే పేరుతో ఉంటుంది. పరమేశ్వరుడు చంద్రకిరణాల రూపంతో ఓషధులను శక్తిమయం చేస్తున్నాడు.

పరమేశ్వరుడు లేనిదెక్కడ?

పాంచభౌతికమైన ఈ సృష్టిలో అణువణువూ ఆయన ఉనికితో తేలరిల్లుతోంది. భూమి,గాలి, నీరు,నిప్పు, ఆకాశం... సర్వం శివమయమే. శివపురాణం ప్రకారం ఈశ్వరుడు ఎనిమిది రూపాలతో సకల సృష్టిని అనుగ్రహిస్తుంటాడు. వాటినే అష్టమూర్తులుగా మనం ఆరాధిస్తాం. ఆ రూపాలు మనకు మనం చూసేందంతా శివుడే అని చాటుతాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు