క్షమించేద్దాం!

తోటి వారిని క్షమించడం గొప్ప లక్షణంగా పేర్కొంటోంది ఖురాన్‌. పగ, ప్రతీకారాలు ఇస్లామ్‌ స్ఫూర్తికి విరుద్ధం.

Updated : 25 Mar 2021 03:07 IST

తోటి వారిని క్షమించడం గొప్ప లక్షణంగా పేర్కొంటోంది ఖురాన్‌. పగ, ప్రతీకారాలు ఇస్లామ్‌ స్ఫూర్తికి విరుద్ధం.

‘నువ్వు వెయ్యి తప్పులు చేసినా నిన్ను నువ్వు ప్రేమించుకుంటావు. కానీ ఎదుటి వారు ఒక్కతప్పు చేసినంత మాత్రానికే ఎందుకు ద్వేషిస్తావ్‌’ అని ప్రశ్నిస్తారు షేక్‌ సాదీ అలై రహ్మా. ప్రతీకారం తీర్చుకోవడం కంటే క్షమించడం ఉత్తమమైనది. ఒకరిని క్షమించడం వల్ల అల్లాహ్‌ అనుగ్రహానికి పాత్రులవవచ్చు. మనవల్ల జరిగిన తప్పిదాలకు క్షమాపణ వేడుకోవడం, ఇతరుల తప్పులను మన్నించడంలో ఆలస్యం చేయవద్దంటారు ఉలమాలు. దీనివల్ల మనశ్శాంతి దొరుకుతుంది. పేదరికంలో దానం చేయడం, కోపంలో నిజం చెప్పడం, ప్రతీకారం తీర్చుకునేంత బలమున్నా క్షమించడం ఉత్తమమైన పుణ్యకార్యాలు అంటారు హజ్రత్‌ అలీ (రజి). . ‘లడాయి లడాయి మాఫ్‌ కరో అల్లాహ్‌ కా ఘర్‌ సాఫ్‌ కరో’ అనేది పాత సామెత. ఇద్దరు పోట్లాడుకున్నప్పుడు పరస్పరం క్షమించుకుని దేవుని గృహాన్ని శుభ్రం చేయాలి అన్నది దీని అర్థం. ఇక్కడ అల్లాహ్‌ కా ఘర్‌ అంటే హృదయం అని అర్థం. ఎలాంటి కల్మషం లేని పరిశుద్ధ హృదయంలోనే దేవుడు ఉంటాడు.

- ఖైరున్నీసాబేగం


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని