వారితో జాగ్రత్త

కొండ ఎక్కుతున్న ఇద్దరు భక్తుల మధ్య తలెత్తిన తగాదాని ప్రస్తావిస్తూ వారికి ఇలా సూచించాలని తన శిష్యులతో చెప్పారు రమణులు.. ‘ఎవరు మనల్ని దూషిస్తాడో అతడే మన మిత్రుడు.

Updated : 29 Jul 2021 00:59 IST

గురుబోధ

కొండ ఎక్కుతున్న ఇద్దరు భక్తుల మధ్య తలెత్తిన తగాదాని ప్రస్తావిస్తూ వారికి ఇలా సూచించాలని తన శిష్యులతో చెప్పారు రమణులు.. ‘ఎవరు మనల్ని దూషిస్తాడో అతడే మన మిత్రుడు. ఎందుకంటే, అతను దూషించేది మనకు శత్రువైన మన శరీరాన్ని మాత్రమే. శత్రువుకు శత్రువు పరమ మిత్రుడు గదా. నిజంగా మనల్ని భూషించే వారి విషయంలో మనం జాగ్రత్తపడాలి’ అని చెప్పారు. భగవాన్‌ శిష్యులు వారిద్దరికీ ఆ సందేశాన్ని అందించటానికి వెళితే వారు అప్పటికే తమ తగవును పరిష్కరించుకునే యోచనలో ఉన్నారు. తర్వాత వాళ్లు కలుసుకుని గతాన్ని మర్చిపోదామని అనుకున్నారు. అయితే అంతకు ముందు ఒకరికొకరు దూషించుకుంటూ ఉత్తరాలు రాసుకున్నారు. వాటిని తగలబెడదామని ఒక వ్యక్తి చెప్పాడు. వెంటనే రమణులు ‘కాగితాలు తగలబెట్టినంత మాత్రాన ప్రయోజనం ఏంటి? హృదయంలో అది మళ్లీ రగుల్కోకుండా తగలబెట్టాలి’ అని చెప్పారు. సత్యాసత్యాలు, వాస్తవ దృష్టి విషయంలో రమణులు ఒకసారి ఇలా చెప్పారు.. ‘ఏదైనా యుక్తియుక్తంగా ఉంటే, ఒక బాలుడు చెప్పినా గ్రహించండి. అలా లేకుంటే బ్రహ్మ చెప్పినా తృణీకరించండి’

- శాలిని


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు