సహజాతి సహజం

ఒక ఆశ్రమంలో ఇద్దరు సాధువులున్నారు. వారి గురువు దేశంలో శిష్యుల ఆశ్రమాలనూ సందర్శిస్తూ, ఈ ఊరికీ రాబోతున్నారని తెలిసింది. గురువు గారికి ఘనంగా స్వాగతం పలకాలను కున్నారు

Updated : 23 Sep 2021 05:47 IST

క ఆశ్రమంలో ఇద్దరు సాధువులున్నారు. వారి గురువు దేశంలో శిష్యుల ఆశ్రమాలనూ సందర్శిస్తూ, ఈ ఊరికీ రాబోతున్నారని తెలిసింది. గురువు గారికి ఘనంగా స్వాగతం పలకాలను కున్నారు. ఆశ్రమాన్ని చక్కగా శుభ్రం చేశారు. తోరణాలతో అలంకరించారు. ఆశ్రమం బయట గడ్డిపై పడిన పండుటాకుల్నీ ఎండుటాకుల్నీ తీసేసి శుభ్రం చేశారు.

అనుకున్న రోజున గురువుగారు వచ్చారు. ఆశ్రమం అంతా కలియతిరిగారు. ఏర్పాట్ల గురించి ఒక్కమాట కూడా మాట్లాడలేదు. శిష్యులిద్దరికీ మనసులో ఏదో వెలితిగా అనిపించింది. అలాగే కొంత భయం వేసింది. తాము ఏమైనా లోటు చేయలేదు కదా.. గురువు గారికి ఏదైనా ఇబ్బంది కలిగించే అంశం ఏదీ చోటుచేసుకోలేదు కదా అని కొంతసేపు తర్జనభర్జన పడ్డారు. చివరికి ధైర్యం చేసి ‘గురువు గారూ! ఏర్పాట్లు ఎలా ఉన్నాయి?’ అంటూ గురువుగారిని అడిగేశారు. దానికి ఆయన బదులు చెప్పకుండా గబగబా బయటకు వెళ్లారు. ఎండుటాకులూ పండుటాకులూ తెచ్చి పచ్చిక తివాచీపై వెదజల్లి ‘ఇప్పుడు అంతా సరిగ్గ్గా ఉంది’ అంటూ హాయిగా నవ్వారు. పరిణామాలూ, పర్యవసానాలూ సహజాతి సహజం, దేన్నీ దాచిపెట్టాల్సిన, దేనికీ దుఃఖించాల్సిన అవసరం లేదన్నారు.

- వి.సమీర్‌ ధర్మశాస్త


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని