దేవుణ్ని మెప్పించిన విజ్ఞాపన

దేవుని ప్రార్థించే ఆయా విధానాల గురించి క్రీస్తు తనదైన శైలిలో శిష్యులకు ఇలా వివరించారు... ‘ఒకసారి ఇద్దరు వ్యక్తులు ప్రార్థనా మందిరానికి వెళ్లారు. అందులో ఒక వ్యక్తి సంపన్నుడైన మత పెద్ద. మరో వ్యక్తి పన్నులు...

Updated : 23 Nov 2022 11:00 IST

దేవుని ప్రార్థించే ఆయా విధానాల గురించి క్రీస్తు తనదైన శైలిలో శిష్యులకు ఇలా వివరించారు... ‘ఒకసారి ఇద్దరు వ్యక్తులు ప్రార్థనా మందిరానికి వెళ్లారు. అందులో ఒక వ్యక్తి సంపన్నుడైన మత పెద్ద. మరో వ్యక్తి పన్నులు వసూలు చేసే చిరుద్యోగి. మత ప్రవక్త పెద్దగా స్తోత్రాలు చదివాడు. ‘ప్రభువా! నేను వారానికి రెండుసార్లు ఉపవాసం చేస్తాను. నా ఆదాయంలో పదో భాగం కానుకగా వేస్తుంటాను. నేను మోసగాడినో, శీలం లేని వ్యక్తినో, దుర్మార్గుడినో కానందుకు నీకు కృతజ్ఞతలు. అదిగో ఆ పక్కనున్న పన్నులు వసూలు చేసే లంచగొండిలా నన్ను తయారుచేయనందుకు నీకు వందనం’ అంటూ ప్రార్థించాడు. మందిరంలో మరో పక్కన నిలబడిన రెండో వ్యక్తి ‘దేవుడా! నేనొక పాపిని. నాపై దయ చూపు. నేను ఆకాశం వైపు కన్నెత్తి చూడటానికి కూడా అర్హత లేని వాడిని’ అంటూ పశ్చాత్తాపంతో ప్రార్థించాడు. ఈ ఇద్దరిలో రెండో వ్యక్తి చేసిన వినయ విజ్ఞాపననే స్వీకరిస్తాడు దేవుడు. అహంకారంతో తామే నీతిమంతులమని గొప్పలు చెప్పుకునే వారి ప్రార్థనను దేవుడు తిరస్కరిస్తాడు. అణకువతో, వినయ విధేయతలతో చేసే ప్రార్థనే దేవుడు అంగీకరిస్తాడని గ్రహించండి’ అంటూ క్రీస్తు ఉదాహరణలతో విడమర్చి చెప్పారు.

- నిశ్చల


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని