సిద్ధంగా ఉండాలి

పదిమంది కన్యకలు దీపాలు పట్టుకుని పెళ్లి విందుకు బయల్దేరినట్లుంది అంటూ పరలోక రాజ్యాన్ని వర్ణించారు క్రీస్తు. తెలివైన అమ్మాయిలు నిద్రపోకుండా వెలుగుతున్న దీపాలతో నిరీక్షించి కబురు వినగానే వెళ్లారు. తక్కినవారు నూనెలేని దీపాలతో నిద్రపోయారు.

Updated : 16 Dec 2021 04:19 IST

దిమంది కన్యకలు దీపాలు పట్టుకుని పెళ్లి విందుకు బయల్దేరినట్లుంది అంటూ పరలోక రాజ్యాన్ని వర్ణించారు క్రీస్తు. తెలివైన అమ్మాయిలు నిద్రపోకుండా వెలుగుతున్న దీపాలతో నిరీక్షించి కబురు వినగానే వెళ్లారు. తక్కినవారు నూనెలేని దీపాలతో నిద్రపోయారు.

మనం ఏ సమయంలోనైనా సిద్ధంగా ఉండాలని క్రీస్తు ఇలా పోల్చి చెప్పారు. పిలుపు వచ్చే సమయం తెలియదు గనుక మెలకువగా ఉండమన్నారు. అడవిలో జంతువులు నిరంతరం జాగ్రత్తగా మసలుతాయి. మరి మానసికంగా వికసించిన మనిషి తనను వెంటాడే క్రోధం, ద్వేషం, పగ, అసూయ- అనే జంతువుల విషయమై అప్రమత్తతతో ఉంటున్నాడా అనేది ప్రశ్న! అడవిలో భయపెట్టే మృగాల్లా కక్ష పగ, ప్రతీకారం విరోధులు. అవి మనల్ని మింగేయకుండా మెలకువగా ఉండాలి. ప్రేమ, కరుణ,  సేవ అనే దివిటీలు వెలిగించి సిద్ధంగా ఉందాలి. ఇలా మెలకువగా ఉంటే గాలి పీల్చుకున్నంత తేలికగా, సునాయాసంగా జీవన ప్రయాణం సాగుతుంది.

- అపేక్ష


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని