పేదరాలు చక్రవర్తి కోడలయింది..

ఖలీఫా ఉమర్‌ (రజి) కాలం అది. ఓ రోజు రాత్రి ఖలీఫా మారువేషంలో గస్తీ తిరుగుతున్నారు. ఓ ఇంట్లోంచి తల్లీ కూతుళ్ల సంభాషణ వినిపించడంతో ఇక ఆయన ముందుకు కదలకుండా అక్కడ నిలబడిపోయి వినసాగారు. 

Updated : 16 Dec 2021 03:53 IST

లీఫా ఉమర్‌ (రజి) కాలం అది. ఓ రోజు రాత్రి ఖలీఫా మారువేషంలో గస్తీ తిరుగుతున్నారు. ఓ ఇంట్లోంచి తల్లీ కూతుళ్ల సంభాషణ వినిపించడంతో ఇక ఆయన ముందుకు కదలకుండా అక్కడ నిలబడిపోయి వినసాగారు.

‘అమ్మా! ఇవాళెందుకో మన మేకలు తక్కువ పాలు ఇచ్చాయి. ఎలాగమ్మా?!’ అని అడిగింది కూతురు.

‘ఆ విషయం గురించి నువ్వు ఎందుకంతగా ఆలోచిస్తున్నావు? పాలల్లో కాసిన్ని నీళ్లు కలిపితే సరిపోతుంది’ అంది తల్లి.

‘కానీ, పాలల్లో నీళ్లు కలపకూడదనే ఖలీఫా ఆదేశముంది కదా!’ మళ్లీ అందామె.

‘పిచ్చిపిల్లా! మనం చేసేదంతా ఖలీఫా చూడవచ్చారా ఏంటీ?!’ ఎదురు ప్రశ్నించింది తల్లి.

‘కానీ ఖలీఫా చూడక పోయినా, ఆ ప్రభువు అందరినీ చూస్తుంటాడు కదమ్మా!’

మర్నాడు ఖలీఫా ఆ తల్లీ కూతుళ్లను రాజదర్బారుకు పిలిపించారు. ఆ అమ్మాయి మంచి మనసును, దైవభీతిని మనసారా మెచ్చుకున్నారు. అంతే కాదు ఆమెని తన కోడలిగా చేసుకున్నారు మహారాజు.

నీతీ నిజాయతీల గొప్పతనం అలాంటిది. ఉలమాలు చెప్పిన కథ ఇది.

- ఖైరున్నీసాబేగం


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని