ఉన్నతాశయం

దక్షిణేశ్వరం కాళీమాత ఆలయంలో ప్రసాదంగా ఇవ్వడానికి లడ్డూలు చేస్తున్నారు. అంతలోనే తయారైన లడ్డూల చుట్టూ చీమలు చేరాయి. ఒకటో రెండో కాదు, చీమల దండు. వంటవాళ్లు ఆశ్చర్యపోయారు. అన్నిటిని చంపడం సాధ్యంకాదు కనుక తరమడమే పరిష్కారం అనిపించింది. కానీ అదెలాగో తెలీక రామకృష్ణ పరమహంసను సలహా అడిగారు.

Updated : 30 Dec 2021 06:09 IST

దక్షిణేశ్వరం కాళీమాత ఆలయంలో ప్రసాదంగా ఇవ్వడానికి లడ్డూలు చేస్తున్నారు. అంతలోనే తయారైన లడ్డూల చుట్టూ చీమలు చేరాయి. ఒకటో రెండో కాదు, చీమల దండు. వంటవాళ్లు ఆశ్చర్యపోయారు. అన్నిటిని చంపడం సాధ్యంకాదు కనుక తరమడమే పరిష్కారం అనిపించింది. కానీ అదెలాగో తెలీక రామకృష్ణ పరమహంసను సలహా అడిగారు.
దానికాయన ‘చీమలు వస్తున్న దారిలో చక్కెర చల్లండి. ఆ పలుకులు తీసుకుని చీమలు వెళ్లిపోతాయి, ఇటు రావు’ అన్నారు. వాళ్లలాగే చేశారు. చీమలు పంచదారను నోట కరుచుకుని కాసేపటికల్లా అక్కడి నుంచి వెళ్లిపోయాయి. సమస్య పరిష్కారమైపోయింది..
ఈ సంఘటనను విశ్లేషిస్తూ పరమహంస ఇలా అన్నారు.. ‘మనుషులు కూడా ఈ చీమల్లాంటివారే. ‘భగవంతుడే సర్వస్వం’ అనుకుని ఆయనను పొందడానికి సాధన మొదలుపెడతారు. కానీ మధ్యలో ఎవరో ఎదో ఆశ చూపితే అటు మళ్లి అందాకా చేసిన సాధననంతటినీ వృథా చేసుకుంటారు.
ఎంతో మధురమైన లడ్డూలను వదిలిపెట్టి మధ్యలోనే దొరికింది, తీయగానే ఉంది అని చక్కెరతో సరిపెట్టుకుని వెళ్లిపోయాయి చీమలు. అంటే ఆ రవ్వంత సంతోషం చాలనుకున్నాయి. అలాగే మనుషుల్లోనూ అసలైన మాధుర్యం, పరిపూర్ణతకోసం స్థిరంగా నిలిచేవారు తక్కువ. మధ్యలో ప్రలోభాలకు లొంగేవారే అధికం’ అన్నారు పరమహంస. ఏదో ఒకదానితో సరిపుచ్చుకుంటే, బతుకు బండిని ఎలాగోలా నడిపితే కాలం గడిచిపోతుంది. కానీ అది నిజమైన జీవనం కాదు. ఒక లక్ష్యం కొంత ఔన్నత్యం ఉండాలన్నది ఇందులో పరమార్థం.

- కామేశ్వరీహైందవి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని