ఐక్యతకు చిహ్నం

భక్తిశ్రద్ధలతో కఠిన దీక్ష చేసిన అయ్యప్ప భక్తులు ఇరుముడి కట్టుకుని స్వామి దర్శనానికి శబరిమల వెళ్తారు. నలభై ఒక్క రోజుల దీక్ష ఫలితం ఇరుముడిలోనే ఉంటుంది. శబరిమల యాత్ర ఎరుమేలితో ప్రారంభం

Updated : 06 Jan 2022 06:26 IST

భక్తిశ్రద్ధలతో కఠిన దీక్ష చేసిన అయ్యప్ప భక్తులు ఇరుముడి కట్టుకుని స్వామి దర్శనానికి శబరిమల వెళ్తారు. నలభై ఒక్క రోజుల దీక్ష ఫలితం ఇరుముడిలోనే ఉంటుంది. శబరిమల యాత్ర ఎరుమేలితో ప్రారంభం అవుతుంది. అక్కడ భక్తులు వావరుస్వామిని దర్శించుకుంటారు. ముస్లిం యువకుడైన వావరు ముందు బందిపోటు దొంగ. పులిపాలకోసమని అయ్యప్ప అడవికి వెళ్లినప్పుడు అడ్డగించిన వావరు తర్వాత స్వామి భక్తుడిగా మారిపోయాడు. ‘నా దర్శనం కోసం వచ్చిన భక్తులు ముందుగా నిన్ను దర్శించుకుంటారు’ అని అయ్యప్ప వావరుకు వరమిచ్చాడు. మసీదులో కొలువైన వావరుస్వామిని దర్శించుకున్న భక్తులు ప్రదక్షిణ చేసిన తర్వాత శరీరానికి రంగులు పూసుకుని రకరకాల వేషధారణలతో పేటతుళ్లి ఆడతారు. మహిషి సంహారం తర్వాత అయ్యప్ప చేసిన తాండవమే పేటతుళ్లి. వావరు మసీదు నుంచి భక్తులు పేటతుళ్లి నాట్యం చేస్తూ ధనుర్బాణధారి అయిన అయ్యప్ప ఆలయానికి చేరుకుని కొబ్బరికాయలు కొడతారు. ఇది హిందూ-ముస్లింల ఐక్యతకు చిహ్నం. జాతి, మత, పేద, ధనిక భేదాలు లేకుండా ఆనంద తాండవం చేయడంలో అందరూ సమానమనే భావన వ్యక్తమవుతుంది.

- ఎం.మస్తీరావు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని