ధ్యాస మళ్లించిన ఖర్జూరం

ఓ రోజు హజ్రత్‌ బాయజీద్‌ బస్తామీ (రహ్మాలై) తన శిష్యుణ్ణి పిలిచి ‘ఈ రోజు ఎందుకో ఆరాధనలో ఎప్పటిలా మనసు లగ్నం కాలేదు. ఒకసారి నా గదిని సోదా చేయండి. లోకంలో వ్యామోహాలకు దారితీసే వస్తువేదైనా నా గదిలో ఉండిపోయిందేమో

Updated : 27 Jan 2022 05:49 IST

రోజు హజ్రత్‌ బాయజీద్‌ బస్తామీ (రహ్మాలై) తన శిష్యుణ్ణి పిలిచి ‘ఈ రోజు ఎందుకో ఆరాధనలో ఎప్పటిలా మనసు లగ్నం కాలేదు. ఒకసారి నా గదిని సోదా చేయండి. లోకంలో వ్యామోహాలకు దారితీసే వస్తువేదైనా నా గదిలో ఉండిపోయిందేమో’ అన్నారు. శిష్యులు గాలించారు. కానీ వారికేదీ దొరకలేదు. ‘నిశితంగా చూడండి. దీనికి ఏదో కారణం తప్పక ఉండే ఉంటుంది’ అన్నారాయన దృఢంగా.

గురువు చెప్పినట్లు జాగ్రత్తగా చూడగా, ఓ ఎండు ఖర్జూరం కనిపించింది. శిష్యులు దాన్ని గురువుకు చూపించారు. బాయజీద్‌ (రహ్మాలై) ఆ ఖర్జూరాన్ని చేతబట్టుకొని ‘ఇంత చిన్నది కూడా చాపల్యానికి దారితీసి ధ్యాస మళ్లించగలదు. అలాంటప్పుడు ఏకాగ్రత ఎలా సాధ్యమవుతుంది?!’ అన్నారు.

మహనీయులు ప్రాపంచిక జీవితం కన్నా పరలోక జీవితానికే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చేవారు. రేపటికోసం ఏమీ ఉంచుకునేవారు కాదు. మృత్యుదూత తమ ప్రాణాలను ఏ క్షణంలోనైనా కబళించవచ్చు అనే స్పృహతో జీవితాన్ని గడిపేవారు.

- ముహమ్మద్‌ ముజాహిద్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని