ప్రభువుకు ఇష్టమైన గుణం

కనాను దేశంలో యాకోబుకు 13 మంది సంతానం. అతనికి చిన్న కొడుకు యోసేపు అంటే అమిత ప్రేమ. అది చూసి అసూయ చెందిన సహోదరులు అతణ్ణి చంపాలనుకున్నారు. ఒక సోదరుడు రూబేను మాత్రం చంపొద్దని వారించగా, యోసేపును పొరుగు దేశ వర్తకులకు అమ్మేసి ఇంటికి వెళ్లి పోయారు.

Updated : 10 Mar 2022 05:06 IST

కనాను దేశంలో యాకోబుకు 13 మంది సంతానం. అతనికి చిన్న కొడుకు యోసేపు అంటే అమిత ప్రేమ. అది చూసి అసూయ చెందిన సహోదరులు అతణ్ణి చంపాలనుకున్నారు. ఒక సోదరుడు రూబేను మాత్రం చంపొద్దని వారించగా, యోసేపును పొరుగు దేశ వర్తకులకు అమ్మేసి ఇంటికి వెళ్లి పోయారు. అక్కడ యోసేపు అనేక కష్టాలు అనుభవించాడు. అతడి తెలివితేటల గురించి తెలిసిన ఆ దేశ రాజు ఉన్నత పదవి అప్పగించాడు. కొన్నాళ్లకు కనాను దేశంలో కరువు రావడంతో యోసేపు ఉన్న దేశానికే వెళ్లారు సోదరులు. వాళ్ల వల్ల తాను ఎన్ని కష్టాలు పడినా క్షమించి అక్కున చేర్చుకున్నాడు. వాళ్లే కాదు, తమ పరివారం 70 మందికి ఆశ్రయమిచ్చాడు. అలా క్షమించడమే మన వ్యక్తిత్వం. అదే ఏసు ప్రభువుకు ఇష్టమైన గుణం.                

- జంగం జ్యోతి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని