బంగారు నాణేల సంచి

ఒక సన్యాసి శిష్యులతో కలిసి ఆశ్రమంలో ఉండేవాడు. ఒకరోజు అటుగా వెళుతున్న బాటసారిని పిలిచి.. ‘నీకు బంగారు నాణేల సంచి దొరికితే ఏం చేస్తావు?’ అనడిగాడు. ‘యజమాని కోసం చూస్తాను. ఎవరూ రాకపోతే రాజభటులకు అందజేస్తాను’ అన్నాడు. అతణ్ణి వెళ్లనిచ్చి ‘ఇతడో మూర్ఖుడు’ అనడంతో..

Updated : 10 Mar 2022 05:13 IST

ఒక సన్యాసి శిష్యులతో కలిసి ఆశ్రమంలో ఉండేవాడు. ఒకరోజు అటుగా వెళుతున్న బాటసారిని పిలిచి.. ‘నీకు బంగారు నాణేల సంచి దొరికితే ఏం చేస్తావు?’ అనడిగాడు. ‘యజమాని కోసం చూస్తాను. ఎవరూ రాకపోతే రాజభటులకు అందజేస్తాను’ అన్నాడు. అతణ్ణి వెళ్లనిచ్చి ‘ఇతడో మూర్ఖుడు’ అనడంతో.. ఆశ్చర్యపోయిన శిష్యులు ‘నిజమే చెప్పాడుగా! మనకేదైనా దొరికినప్పుడు సంబంధిత వ్యక్తులకు అందజేయాలిగా’ అన్నారు. సన్యాసి జవాబు చెప్పకుండా మరో బాటసారిని పిలిచి అదే ప్రశ్న అడిగాడు. ‘నాకు దొరికింది కాబట్టి అది నాదే’ అన్నాడతడు. ‘ఎవరిదో కనుక్కుని ఇవ్వవా?’ అన్నాడు సన్యాసి. ‘దొరికినదాన్ని తిరిగి ఇవ్వడానికి నేనేమన్నా మూర్ఖుడినా?’ హేళనగా అని వెళ్లిపోయాడు. ‘ఇతడో రాక్షసుడు’ అన్నాడు గురువు. ఇంతకీ ఆయన ఏం చెప్పా లనుకుంటున్నదీ వాళ్లకి అర్థం కాక, ఆశ్చర్యంగా చూశారు. తర్వాత మరో బాటసారిని పిలిచి, మళ్లీ అదే ప్రశ్న అడిగాడు గురువు. ‘అది ఇప్పుడే చెప్పలేను స్వామీ! మనిషి బుద్ధి క్షణక్షణం మారుతూనే ఉంటుంది. ఆ చంచల మనసు ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఎవరూ చెప్పలేరు. దేవుడి దయవల్ల ఆ క్షణంలో నాకు మంచి బుద్ధి కలిగితే.. ఆ సంచిని సొంతదారుకు ఇచ్చేస్తాను’ అన్నాడు. అతడు వెళ్లిన తర్వాత సన్యాసి చిరునవ్వుతో ‘అది నిజం. అతడు తన బుద్ధిని దేవుడికే అప్పగించాడు. ఇలాంటి వాళ్లు తప్పుడు నిర్ణయాలు తీసుకోరు’ అన్నాడు.

- మండూరి ఆకాంక్ష


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని