అల్లాహ్‌ మన్నించే రాత్రి

ముహమ్మద్‌ ప్రవక్త (స) సతీమణికి అర్ధరాత్రి మెలకువ వచ్చేసరికి భర్త కనిపించలేదు. ఆమె వెతుక్కుంటూ వెళ్లగా జన్నతుల్‌ బఖీ అనే ఖనన వాటికలో సమాధుల మధ్య కనిపించారు. ఆమెని చూసిన ప్రవక్త (స)

Updated : 17 Mar 2022 05:24 IST

మార్చి 18 షబేబరాత్‌

ముహమ్మద్‌ ప్రవక్త (స) సతీమణికి అర్ధరాత్రి మెలకువ వచ్చేసరికి భర్త కనిపించలేదు. ఆమె వెతుక్కుంటూ వెళ్లగా జన్నతుల్‌ బఖీ అనే ఖనన వాటికలో సమాధుల మధ్య కనిపించారు. ఆమెని చూసిన ప్రవక్త (స) ‘ఆయిషా! నన్నే అనుమానిస్తున్నావా? అల్లాహ్‌ మన్నింపు, కారుణ్యం కురిసే రాత్రి ఇది. అందుకే ఈ సమాధుల్లో ఉన్నవారందరినీ మన్నించమని అల్లాహ్‌ను వేడుకుంటున్నాను’ అన్నారు. షాబాన్‌ నెల 15వ తేదీ అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన ఇస్లామ్‌ చరిత్రలో నిలిచి పోయింది. ‘షబేబరాత్‌’గా జరుపుకునే ఆ రాత్రి జాగారం చేస్తూ మసీదుల్లో నమాజులు చేస్తారు. తమ పెద్దల సమాధులను సందర్శిస్తారు. వారి మగ్భిఫిరత్‌ (మన్నింపు)కోసం దుఆ (ప్రార్థన) చేస్తారు. ‘శుభకరమైన షాబాన్‌ నెలలో నిర్లక్ష్యానికి తావివ్వకూడదు. రంజాన్‌ నెలకు స్వాగతం పలికేందుకు ఎవరికి వారు సన్నద్ధం కావాలి. ప్రార్థనతో దైవసాన్నిధ్యాన్ని పొందాలి’ అంటారు అబ్దుల్‌ ఖాదిర్‌ జీలానీ (రహ్మాలై) మహనీయులు. ఖబరస్థాన్‌లో ప్రవేశించేటప్పుడు ‘అస్సలాము అలకుం యా అహలల్‌ ఖుబూర్‌’ అంటూ చెప్పాలి. ‘సమాధుల్లో నిద్రిస్తున్న వ్యక్తులారా! మీకు శుభమూ శాంతీ చేకూరుగాక’ అన్నది దాని భావం. ‘మన చివరి ప్రయాణం సమాధి. ఈలోపు వీలైనన్ని మంచి పనులు చేయండి! ఒకరింటికి ఒట్టి చేతులతో వెళ్లం కదా! కనుక చివరి మజిలీ కోసం ఏర్పాట్లు చేసుకోండి’ అని చెబుతారు ఉలమాలు.

- ఖైరున్నీసాబేగం


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని