చింతలు తీర్చే అమ్మ

ఉభయగోదావరి జిల్లాల్లో ప్రముఖమైంది చింతలూరు నూకాంబికా అమ్మవారి జాతర. ఫాల్గుణ చతుర్దశితో మొదలై నెలరోజుల పాటు వైభవంగా మహోత్సవం జరుగుతుంది. రెండున్నర శతాబ్దాల క్రితం ఇక్కడ పాలచెట్టులో వెలసిన అమ్మవారు బాలారిష్టాలు నివారించే తల్లిగా

Published : 31 Mar 2022 05:21 IST

భయగోదావరి జిల్లాల్లో ప్రముఖమైంది చింతలూరు నూకాంబికా అమ్మవారి జాతర. ఫాల్గుణ చతుర్దశితో మొదలై నెలరోజుల పాటు వైభవంగా మహోత్సవం జరుగుతుంది. రెండున్నర శతాబ్దాల క్రితం ఇక్కడ పాలచెట్టులో వెలసిన అమ్మవారు బాలారిష్టాలు నివారించే తల్లిగా పూజలందుకుంటోంది. చైత్రంలో లక్షలాదిమంది భక్తులు అమ్మను దర్శించుకుంటారు.

ఫాల్గుణ శుద్ధ విదియ నాడు బుట్టగరగ ఎత్తడంతో జాతర మొదలవుతుంది. తాటాకుబుట్టను అలంకరించి అమ్మ స్వరూపంగా చుట్టుపక్కల గ్రామాల్లో ఊరేగిస్తారు. ఫాల్గుణ పూర్ణిమనాడు ఎత్తయిన ఇత్తడి గరగకు మోదుగమాలలు చుట్టి చతుర్దశి వరకు ఉత్సవం జరుపుతారు. 

అమ్మవారు చంటిపిల్లలను రక్షిస్తుందని, బాలారిష్టాలు తొలగిస్తుందని నమ్మే భక్తులు చంటిపిల్లలతో కాగడాలు వేయిస్తారు. కల్లు కుండతో దిష్టి (వారకల్లు), కోడిపిల్లలతో దిగదుడుపు(తుళ్లుబిళ్ల) తీయిస్తారు. కాకినాడ-రావులపాలెం ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న చింతలూరుకు రవాణా సదుపాయాలు మెండుగా ఉన్నాయి. అరుదైన ధన్వంతరి ఆలయం కూడా ఈ ఊళ్లో ఉంది.

- జి.మంగాదేవి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని