సత్యదేవుడు

ఈ పేరు వినగానే గుర్తుకొచ్చేది అన్నవరం సత్యనారాయణ స్వామి. ఇంతకీ ఈ పేరు ఎందుకొచ్చిందో తెలియాలంటే మనుస్మృతి శ్లోకాన్ని గుర్తుచేసుకోవాలి....

Updated : 28 Apr 2022 04:32 IST

పేరు వినగానే గుర్తుకొచ్చేది అన్నవరం సత్యనారాయణ స్వామి. ఇంతకీ ఈ పేరు ఎందుకొచ్చిందో తెలియాలంటే మనుస్మృతి శ్లోకాన్ని గుర్తుచేసుకోవాలి.

సత్యం బ్రూయాత్‌ ప్రియం బ్రూయాత్‌
న బ్రూయాత్‌ సత్య మప్రియం
ప్రియం చ నానృతం బ్రూయాత్‌
ఏష ధర్మ స్సనాతనః

సత్యాన్నే పలుకు, ప్రియంగా మాట్లాడు. నిజమైనా అప్రియమైన మాటలు వద్దు. ఇదే సనాతన ధర్మం- అనేది దీని భావం. ఇది ఎలా మాట్లాడాలో మాత్రమే కాదు, ఏది అడగాలో, ఏం వినాలో కూడా చెబుతుంది. నిజమనుకున్నప్పుడే వినాలి, మంచిమాటలే వినాలి. అలాంటి సత్యమైన దేవుడే అన్నవరం సత్యనారాయణ స్వామి. సత్యాన్ని ఆశ్రయించినవారికి బాధలు ఉండవని కూడా ఈ స్వామి కథలు వివరిస్తాయి.

- శ్రావణి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని