పరీక్షించిన ప్రభువు

అబ్రహాంను దీవించి వందేళ్ల వయసులో ఇస్సాకును కొడుకుగా ప్రసాదించాడు ప్రభువు. కొన్నాళ్లకు అబ్రహాం విశ్వాసాన్ని పరీక్షించడానికి తానిచ్చిన పుత్రుడు ఇస్సాకును కొండ మీదికి తీసుకెళ్లి బలి ఇవ్వమన్నాడు. 

Updated : 17 May 2022 17:06 IST

అబ్రహాంను దీవించి వందేళ్ల వయసులో ఇస్సాకును కొడుకుగా ప్రసాదించాడు ప్రభువు. కొన్నాళ్లకు అబ్రహాం విశ్వాసాన్ని పరీక్షించడానికి తానిచ్చిన పుత్రుడు ఇస్సాకును కొండ మీదికి తీసుకెళ్లి బలి ఇవ్వమన్నాడు. 

అబ్రహాం దేవుడు చెప్పినట్లే పుత్రుణ్ణి తీసుకొని పయనమయ్యాడు. కొండ మీదికి చేరుకున్నాడు. అబ్రహాం మెల్లగా కత్తిని ఎత్తాడు. అంతలోనే ‘అబ్రహాం ఆగు! ఆ చిన్నవాణ్ణి చంపొద్దు’ అని దేవుడి స్వరం వినిపించింది. తర్వాత పక్కనే ఉన్న పొదల్లో దేవుడు ఏర్పాటుచేసిన గొర్రెపిల్లను బలిగా అర్పించి ఇస్సాకును తీసుకుని ఇంటికి బయల్దేరాడు. ఇస్సాకు దేవుడిచ్చిన బహుమానం. అందుకే అబ్రహాం దైవాజ్ఞను పాటించేందుకు సిద్ధమయ్యాడు. కృతజ్ఞతా భావం కలిగి ఉండాలి, పొందినదాన్ని తిరిగివ్వడానికి వెనకాడకూడదు- అనేదే దైవ సందేశం.    

- జె.జ్యోతి 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని