ఏది ముఖ్యం?!

ఒకరోజు ఇస్రా నగరానికి నిప్పంటుకుంది. ఊరంతా దగ్ధమైపోతోంది. హజ్రత్‌ మాలిక్‌ బిన్‌ దీనార్‌ (రహ్మాలై) ఇల్లు కూడా తగలబడుతోంది. ఆయన వెంటనే తన చేతి కర్ర, దుప్పటి,

Updated : 09 Jun 2022 02:44 IST

ఇస్లాం సందేశం

కరోజు ఇస్రా నగరానికి నిప్పంటుకుంది. ఊరంతా దగ్ధమైపోతోంది. హజ్రత్‌ మాలిక్‌ బిన్‌ దీనార్‌ (రహ్మాలై) ఇల్లు కూడా తగలబడుతోంది. ఆయన వెంటనే తన చేతి కర్ర, దుప్పటి, చెప్పులు తీసుకుని బయటకొచ్చి నిలబడ్డారు. అది చూసిన చుట్టుపక్కల వారు ఆశ్చర్యపోతూ ‘అయ్యో ఇల్లు తగలబడిపోతుంటే అలా నిలబడ్డారేంటి? సామానంతా కాలిపోతుంటే బయటకు తీసుకురాలేదేం?’ అన్నారు.‘ఇంట్లో ఉన్నదంతా చేత్తో పట్టుకొచ్చేశాను. పెద్దగా బరువులు పోగుచేయలేదు కనుక తేలిగ్గా బయటపడ్డాను. సొమ్ములు పెరిగేకొద్దీ భ్రాంతులు ఎక్కువవుతాయి’ అన్నారాయన.

ప్రాపంచిక జీవితం ఒక పరీక్షావేదిక. ఇక్కడ ఆస్తులను స్వార్థం కోసం కాకుండా దైవమార్గంలో వెచ్చించాలన్నది ఆయన సందేశం.

- తహూరా సిద్దీఖా


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని