కళ్లు లేవు కానీ...

ఆ బాలుడు పుట్టుగుడ్ఢి అయినా కళాకారుడయ్యాడు. ఒకరోజు మక్కాలో ముహమ్మద్‌ సత్యధర్మాన్ని బోధిస్తున్నారు. ముహమ్మద్‌ పేరు సుపరిచితం.

Updated : 16 Jun 2022 03:39 IST

బాలుడు పుట్టుగుడ్ఢి అయినా కళాకారుడయ్యాడు. ఒకరోజు మక్కాలో ముహమ్మద్‌ సత్యధర్మాన్ని బోధిస్తున్నారు. ముహమ్మద్‌ పేరు సుపరిచితం. ప్రజలు ఆయన్ను కీర్తించడం బాల్యంనుంచి వింటున్నాడు. సాదిక్‌, అమీన్‌ అని పిలవడమూ గుర్తుంది. తననెవరూ పట్టించుకోకున్నా ఆయన మాత్రం వచ్చి పరామర్శించి, యోగక్షేమాలు అడిగి వెళ్లేవారు. ఈరోజు స్వయంగా తనే వెళ్లి ఆయన్ను కలుసుకోవాలని నిశ్చయించు కున్నాడు. ప్రవక్త(స) ఎక్కడున్నదీ అడిగి తెలుసుకుని వెళ్లేసరికి ‘పర్వతాలూ, సముద్రాలూ, ఆకాశం, భూమి, సూర్య చంద్రులూ, సకల చరాచర సృష్టికీ మూలం దైవమే’ అని చెబుతోంటే అతనికేమీ అర్థంకాలేదు. తనెన్నడూ వాటిని చూడలేదు. అవెలా ఉంటాయో తెలియదు. ప్రవక్త(స) తన మాటలు కొనసాగిస్తూ ఇలా అన్నారు... ‘మనకి మాట్లాడే శక్తినిచ్చింది అల్లాహ్‌. కాళ్లూచేతులూ ప్రసాదించిందీ, వినే శక్తినిచ్చిందీ- అన్నీ ఆయనే’

కొంత అర్థమైనట్లుంది. అక్కడున్న వ్యక్తిని ‘మరి అల్లాహ్‌ ఎలా వుంటాడు?’ అనడిగాడు. ‘అల్లాహ్‌కు ఆకారం లేదు, భౌతిక నేత్రాలతో ఆయన్ను చూడలేం’ అంటూ బదులొచ్చింది. ‘అంటే చూపున్నవారు కూడా ఆయన్ను చూడలేరన్నమాట. ఇక నాకు కళ్లు లేవన్న దిగులెందుకు?’ అనుకున్నాడు. ఆ క్షణమే ప్రవక్త (స) శిష్యగణంలో చేరిపోయాడు.

- ఖైరున్నీసాబేగం


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని